https://oktelugu.com/

వాట్సాప్ కు కేంద్రం షాక్.. కొత్త యాప్ ను ప్రారంభించనున్న కేంద్రం..?

దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు మెసేజ్ లు, కాల్స్ కోసం వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది వాట్సాప్ యాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్రం వాట్సాప్ కు మరో భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కేంద్రం వాట్సాప్ తరహా ఫీచర్లతో ఒక కొత్త యాప్ ను త్వరలో లాంఛ్ చేయనుందని తెలుస్తోంది. Also Read: గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే రూ.1,600 పొందే ఛాన్స్.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 8, 2021 / 04:52 PM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో యూజర్లు మెసేజ్ లు, కాల్స్ కోసం వాట్సాప్ యాప్ ను వినియోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది వాట్సాప్ యాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్రం వాట్సాప్ కు మరో భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. కేంద్రం వాట్సాప్ తరహా ఫీచర్లతో ఒక కొత్త యాప్ ను త్వరలో లాంఛ్ చేయనుందని తెలుస్తోంది.

    Also Read: గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే రూ.1,600 పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

    కేంద్రం సందేశ్ పేరుతో ఈ యాప్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. ప్రభుత్వ అధికారులకు పరీక్ష కొరకు కేంద్రం ఇప్పటికే సందేశ్ యాప్ ను అందుబాటులోకి
    తీసుకొచ్చిందని సమాచారం. గతేడాది వాట్సాప్ తరహా యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం ధృవీకరించగా మొదట ఈ యాప్ కు జిమ్స్ అని పేరు పెట్టవచ్చని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం జిమ్స్ అనే పేరును కేంద్రం సందేశ్ గా మార్చిందని తెలుస్తోంది.

    Also Read: వాహనదారులకు శుభవార్త.. టెస్టు లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్..?

    ప్రస్తుతం కొన్ని మంత్రిత్వ శాఖల అధికారులు ఈ యాప్ ను వాడుతుండగా ఈ యాప్ లో అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. సందేశ్ యాప్ లో వన్ టైమ్ పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫామ్ లలో ఈ యాప్ ను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ తరహా ఫీచర్లతో దేశీ యాప్ అందుబాటులోకి వస్తే ఈ యాప్ పై దేశంలోని ప్రజలు ఆసక్తి చూపే అవకాశం ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే వాటిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సందేశ్ యాప్ కు బ్యాక్ ఎండ్ సపోర్ట్ అందిస్తుందని తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ యాప్ దేశంలోని ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.