అస్సాం టీపై కుట్ర.. బయటపెట్టిన చాయ్ వాలా.. మోదీ

భారతీయ టీ ప్రాముఖ్యతను దెబ్బతీయడానికి అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుందంటా.. ఇలా చేయడం వెనక భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీల కుట్ర సైతం ఉందంట. ఇప్పటికే దీనికి సబంధించిన కొన్ని ఆధారాలు.. ఫైళ్లు కేంద్రం వద్ద సిద్ధంగా ఉన్నాయంట. త్వరలో ఈ కుట్రలన్నింటిని ఛేదిస్తారంట.. అంతే కాదు.. ఈ పోరాటంలో అస్సాం టీ కార్మికులు విజయం సాధిస్తారంటా.. ఈ కుట్రకు సంబంధించిన సిద్ధాంతాన్ని చాలా పకడ్బందీగా చెప్పింది. ఎవరో సామాన్యుడైతే పర్వాలేదు. ఏదో కామెడీ చేస్తున్నాడని […]

Written By: Srinivas, Updated On : February 8, 2021 4:49 pm
Follow us on


భారతీయ టీ ప్రాముఖ్యతను దెబ్బతీయడానికి అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుందంటా.. ఇలా చేయడం వెనక భారత్ లోని కొన్ని రాజకీయ పార్టీల కుట్ర సైతం ఉందంట. ఇప్పటికే దీనికి సబంధించిన కొన్ని ఆధారాలు.. ఫైళ్లు కేంద్రం వద్ద సిద్ధంగా ఉన్నాయంట. త్వరలో ఈ కుట్రలన్నింటిని ఛేదిస్తారంట.. అంతే కాదు.. ఈ పోరాటంలో అస్సాం టీ కార్మికులు విజయం సాధిస్తారంటా.. ఈ కుట్రకు సంబంధించిన సిద్ధాంతాన్ని చాలా పకడ్బందీగా చెప్పింది. ఎవరో సామాన్యుడైతే పర్వాలేదు. ఏదో కామెడీ చేస్తున్నాడని అనుకోవచ్చు. కానీ… ఇలా చెప్పింది సాక్ష్యాత్తూ… దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

Also Read: మంచు కరిగితే.. ముంచడమే‘నా’.

ఇప్పుడాయన బెంగాల్ అస్సాం ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అస్సాంలో ప్రచారానికి వెళ్లిన మోదీ టీ తోటలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి మట్లాడి.. టీపై జరుగుతున్న కుట్ర కోణాన్ని వివరించారు. భారతీయ టీ బ్రాండును దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటే.. కార్మికులు వారితో పోరాడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి ప్రయత్నం చేసిఉంటే.. ఛేదించి కుట్రదారులను ప్రజల ముందు ఉంచాలి. కానీ ఇలా ఎన్నికల బహిరంగ సభలో రాజకీయానికి వాడుకోవడం సరికాదని అంటున్నారు… కొందరు..

Also Read: సాగు చట్టాలపై పార్లమెంట్ లో మోడీ సంచలన వ్యాఖ్యలు

మోదీ స్టైలు వేరు. అస్సాం టీ బ్రాండ్ ను దెబ్బతీయడానికి ప్రయత్నించేంది.. కొన్ని రాజకీయ పార్టీలంటూ.. విపక్షాల మీద అనుమానం వచ్చేలా చేయడం మోదీకి కొత్తేం కాదు. ప్రధానిస్థాయిలో కొనసాగుతున్న నేత ఇలా మాట్లాడుతారని చాలా మంది అనుకోరు. గత ఎన్నికల సమయంలోనూ.. ఆయన వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి ఆరోపణలే చేశారు. చివరికి ఏపీలోనూ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు ఏటీఎంలా వాడుకుంటున్నారని విమర్శించారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం పాలిటిక్స్

అదే విధంగా ఐటీ గ్రీడ్ పేరుతో వైసీపీ డేటా చోరీ గేమ్ ఆడిందని ఆరోపించారు. ప్రధాని స్థాయిలో కొనసాగుతున్న వ్యక్తి చేయాల్సిన విమర్శలు కావు ఇవని ఇప్పటికే చాలా మంది చెప్పుకున్నారు. కానీ ఎన్నికల విషయంలో ఆయన తన హోదాను పట్టించుకోలేదు.. పట్టించుకోరు… వాస్తవమో.. అవాస్తవమో.. ఏదో ఒకటి చెప్పి విపక్షాలను కంగారు పెట్టేయాలని అనుకుంటారు మోదీ. ప్రజల్లో సరికొత్త అనుమానాలు రేకెత్తించాలని కోరుకుంటారు. అందుకే ఇప్పుడు అస్సాం టీ పై కుట్ర సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు.