ఆ ఊరిలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే.. ఎక్కడంటే..?

సాధారణంగా ఏ ఊరిలోనైనా ఒక వీధిలో ముగ్గురు నుంచి పది మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అయితే ఒక ఊరిలో మాత్రం ప్రతి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అదిలాబాద్ జిల్లాలోని కుభీర్ మండలం రాజురా గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు లేదా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గమనార్హం. జుమ్డ గ్రామపంచాయతీకి ఈ గ్రామం అనుబంధ గ్రామంగా ఉంది. Also Read: వాట్సాప్ కు కేంద్రం షాక్.. కొత్త యాప్ ప్రారంభించనున్న కేంద్రం..? […]

Written By: Navya, Updated On : February 8, 2021 5:24 pm
Follow us on

సాధారణంగా ఏ ఊరిలోనైనా ఒక వీధిలో ముగ్గురు నుంచి పది మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అయితే ఒక ఊరిలో మాత్రం ప్రతి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అదిలాబాద్ జిల్లాలోని కుభీర్ మండలం రాజురా గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు లేదా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గమనార్హం. జుమ్డ గ్రామపంచాయతీకి ఈ గ్రామం అనుబంధ గ్రామంగా ఉంది.

Also Read: వాట్సాప్ కు కేంద్రం షాక్.. కొత్త యాప్ ప్రారంభించనున్న కేంద్రం..?

ఈ కుగ్రామం జనాభా 300 కాగా ఈ గ్రామంలో 200 మంది ఓటర్లు, రెండు వార్డులు ఉన్నాయి. కుభీర్ మండలం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలు మాత్రమే జీవనం సాగిస్తున్నారు. రాజురా గ్రామంలో ప్రతి ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉద్యోగులు ఉండటం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొందరు అటెండర్ ఉద్యోగాలు చేస్తుంటే మరి కొందరు సైంటిస్ట్ లుగా ఉన్నారు.

Also Read: గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే రూ.1,600 పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొందరు వైద్యులుగా మరి కొందరు డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఆర్మీ ఆఫీసర్లుగా ఉన్నారు. గ్రామంలో ప్రభు అనే ఒక రైతు ఉండగా ఆ రైతుకు పుట్టిన ముగ్గురు కొడుకులు ఉన్నారు. అతని ముగ్గురి కొడుకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈ గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన గ్రామం అయినప్పటికీ గ్రామంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులే ఉండటం గమనార్హం. గ్రామంలో అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిని స్పూర్తిగా తీసుకొని మిగిలిన వారు ప్రభుత్వ ఉద్యోగాలను పొందుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఈ గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత విద్యార్థులు ఇతర గ్రామాలలోని ఉన్నత పాఠశాలలలో చేరి ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. రాజురా గ్రామానికి రోడ్డు కూడా సరిగ్గా లేకపోయినా గ్రామంలోని విద్యార్థులు కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం గమనార్హం.