https://oktelugu.com/

Telangana : తెలంగాణలో రోజు రోజుకీ కుచించుకుపోతున్న సామాజిక న్యాయం

మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 62 మంది ఎమ్మెల్యేలు అగ్రవర్ణాల వారే.. బీసీలు కేవలం 19 మందినే .. అగ్రవర్ణాలు దాదాపు 52 శాతం ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. బీసీలు కేవలం 16 శాతం మంది మాత్రమే గెలిచారు. వెలమలు 13 మంది గెలిచారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 6, 2023 2:30 pm

    Telangana : తెలంగాణలో ఎన్నికైనటువంటి అభ్యర్థుల సామాజిక ముఖచిత్రం ఎలా ఉందో చూద్దాం.. 2014లో తెలంగాణ ఏర్పడింది. ఇది మూడో ఎన్నిక.. తెలంగాణ ఏర్పడితే 50 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలకు అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర కంటే ప్రత్యేక తెలంగాణలో న్యాయం జరుగుతుందని అనుకున్నారు.

    కానీ ఎన్నికైనా అభ్యర్థుల ముఖచిత్రం చూస్తుంటే అది రిప్లెక్ట్ కావడం లేదు. చాలా చైతన్యవంతమైన సమాజం.. కులాలకు అతీతంగా తెలంగాణ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ తెలంగాణ ఎన్నికల్లో అతి తక్కువ జనాభా ఉన్న అగ్రవర్ణాల వారు 50 శాతం సీట్లు గెలిచారు.

    మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 62 మంది ఎమ్మెల్యేలు అగ్రవర్ణాల వారే.. బీసీలు కేవలం 19 మందినే .. అగ్రవర్ణాలు దాదాపు 52 శాతం ఎమ్మెల్యేలుగా గెలిస్తే.. బీసీలు కేవలం 16 శాతం మంది మాత్రమే గెలిచారు. వెలమలు 13 మంది గెలిచారు.

    తెలంగాణలో రోజు రోజుకీ కుచించుకుపోతున్న సామాజిక న్యాయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలు చూడొచ్చు.

    తెలంగాణలో రోజు రోజుకీ కుచించుకుపోతున్న సామాజిక న్యాయం || Telangana MLAs || Ram Talk