Meenakshi Chaudhary: గుంటూరు కారం మూవీతో బంపర్ ఆఫర్ కొట్టేసింది మీనాక్షి చౌదరి. పూజా హెగ్డే తప్పుకోవడంతో అమ్మడుకు ఛాన్స్ దక్కింది. దర్శకుడు త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీ హీరోయిన్స్ గా పూజ హెగ్డే, శ్రీలీలను ఎంపిక చేశాడు. కొన్ని కారణాలతో పూజ హెగ్డే ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో శ్రీలీలను మెయిన్ లీడ్ చేసి, మీనాక్షిని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. మహేష్ హీరోగా నటిస్తున్న గుంటూరు కారం మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
గుంటూరు కారం మూవీ ప్రకటన తర్వాత మీనాక్షి చౌదరికి కొని క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ సరసన ఆమెకు ఛాన్స్ దక్కింది. విజయ్ 68వ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. కెరీర్ లో మీనాక్షి చౌదరికి ఇది భారీ ఆఫర్ అని చెప్పొచ్చు. గుంటూరు కారం కూడా స్టార్ హీరో మూవీ అయినప్పటికీ ఈ చిత్రంలో ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్.
త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఒక్కోసారి కనీసం ఓ సాంగ్ కూడా ఉండదు. కాబట్టి విజయ్ 68వ చిత్రంతో మీనాక్షి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం కలదు. గుంటూరు కారం, విజయ్ 68తో పాటు మరికొన్ని చిత్రాలు ఆమె చేస్తున్నారు. విశ్వక్ సేన్ కి జంటగా ఓ మూవీ చేస్తుండగా ఇది చిత్రీకరణ జరుపుకుంటుంది.
అలాగే వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కాలో హీరోయిన్ గా చేస్తుంది. మీనాక్షి చౌదరి ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. అలాగే ఓ తమిళ చిత్రం కూడా ఆమె చేస్తున్నారు. అరడజను చిత్రాలతో మీనాక్షి కెరీర్ స్వింగ్ లో ఉంది. అదే సమయంలో మీనాక్షి ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా మేకప్ లేకుండా తన నేచురల్ లుక్ షేర్ చేసింది. మీనాక్షి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.