మాంసం తినేవారికి శుభవార్త.. కోళ్లు, మేకలు చంపకుండా టేస్టీ మాంసం..!

మనలో చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కొందరు ప్రతిరోజూ మాంసం తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే కోళ్లు, మేకలను చంపితే మాత్రమే చికెన్, మటన్ వస్తుంది. ఇప్పుడు మాంసం అలాగే కొనుగోలు చేస్తున్నా భవిష్యత్తులో మాత్రం కోళ్లు, మేకలను కోయకుండానే మాంసం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వినడానికి ఆశ్చర్యంగానే అనిపించినా శాస్త్రవేత్తలు కోళ్లు, మేకలు అవసరం లేకుండా అదే రుచితో ఉండే కృత్రిమ మాంసాన్ని […]

Written By: Kusuma Aggunna, Updated On : December 5, 2020 7:32 pm
Follow us on


మనలో చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. కొందరు ప్రతిరోజూ మాంసం తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే కోళ్లు, మేకలను చంపితే మాత్రమే చికెన్, మటన్ వస్తుంది. ఇప్పుడు మాంసం అలాగే కొనుగోలు చేస్తున్నా భవిష్యత్తులో మాత్రం కోళ్లు, మేకలను కోయకుండానే మాంసం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వినడానికి ఆశ్చర్యంగానే అనిపించినా శాస్త్రవేత్తలు కోళ్లు, మేకలు అవసరం లేకుండా అదే రుచితో ఉండే కృత్రిమ మాంసాన్ని సృష్టిస్తున్నారు. సింగపూర్ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి ఎంతో రుచిగా ఉండే కృత్రిమ మాంసాన్ని తయారు చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు ఈ తరహా పరిశోధనలు చేస్తుండగా ఎట్టకేలకు శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించి మంచి ఫలితాలు వచ్చాయి.

ప్రపంచంలోని చాలా దేశాలు జంతువులను చంపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో ఈ పరిశోధన వల్ల భవిష్యత్తుల్లో ప్రయోగశాలల్లో తయారైన మాంసం మాంసాహార ప్రియులకు అందుబాటులోకి రానుంది. సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగశాలల్లో తయారైన మాంసం అమ్మేందుకు ఈట్ జస్ట్ అనే స్టార్టప్ ల్యాబ్ కు అనుమతులను ఇచ్చింది. దీంతో సింగపూర్ ప్రజలకు కృత్రిమ మాంసం అందుబాటులోకి వచ్చింది.

కృత్రిమ మాంసం సాధారణ మాంసానికి ప్రత్యామ్నాయం కాబోతుంది. జీవ హింసను వ్యతిరేకించే వాళ్లు కృత్రిమ మాంసాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. జంతువుల కండరాల కణాల నుండి శాస్త్రవేత్తలు కృత్రిమ మాంసాన్ని తయారుచేశారు.