Bandi Sanjay: కొడుకు మీద ఫోక్సో కేసు నమోదైన తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజకీయంగా అంత యాక్టివ్ గా లేరు. పైగా ఆయన తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు. ఒకప్పటి మాదిరిగా ప్రత్యర్ధుల మీద ఆయన ఆగ్రహం గా ఉండడం లేదు. తీవ్రస్థాయిలో మాట్లాడటం లేదు. కార్యకర్తలను కలుస్తున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ లేదా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆయన దగ్గరగా ఉంటున్నారు.
కొద్దిరోజుల క్రితం బండి సంజయ్ ఆ మాత్రం కూడా అందుబాటులో లేకుండా పోయారు. సన్నిహితులకు కూడా ఆయన సమాచారం తెలియదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి ఏమైంది.. ఆయన ఏమైపోయారు.. ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లిపోయారు అనే చర్చ నడిచింది. ఇక నమస్తే తెలంగాణ అయితే బండి సంజయ్ మీద టన్నులకొద్దీ బురద కథనాలు రాయడం మొదలుపెట్టింది. అయితే బండి సంజయ్ ఎట్టకేలకు బయటికి వచ్చారు. తాను ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయానో వివరించారు.
బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్లలేదు. ఎవరికీ కనిపించకుండా పోలేదు. ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ పాలు తాగడం వల్ల ఆయన ఆరోగ్యం పాడైంది. దీంతో ఆయన చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. గర్జన 20 సంవత్సరాలుగా బండి సంజయ్ కానీ దగ్గు లేదా జ్వరంతో కూడా బాధపడలేదు. హైదరాబాద్ నగరంలో కల్తీ పాలు తాగడం వల్ల ఐదు రోజులు ఆయన మంచానికే పరిమితమయ్యారు. ఇదే విషయాన్ని ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట లోని కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ రైతు సమ్మేళనంలో వెల్లడించారు.
రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉండాలని.. ప్రకృతి సిద్ధ మీద దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సేంద్రీయ సాగుతో రైతుల కోటీశ్వరులు కావచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులను ప్రకృతిసిద్ధమైన ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు 10,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడాన్ని బండి సంజయ్ అభినందించారు.
ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల వినియోగం పెరిగిపోయింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడులలో ఈ విషయాలు వెలుగుచూస్తున్నాయి. చివరికి కేంద్రమంత్రి కూడా కల్తీ పాల వల్ల అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిని బట్టి హైదరాబాదు నగరంలో ఆహార పదార్థాలు నాణ్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర హోం మంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అవగతం చేసుకోవచ్చు.

