Narendra Modi France visit : నరేంద్ర మోడీ ప్రస్తుతం జీ7 సమ్మిట్ లో పాల్గొనడానికి ఆయన ఫ్రాన్స్ వెళ్లిపోయారు. ఫ్రాన్స్ దేశంతో భారత్ కు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఉంది. గతంలో అనేక రకాల ఆయుధాలను.. యుద్ధ విమానాలను భారత్ కు అందించింది. భారత్ నుంచి కూడా ఫ్రాన్స్ దేశానికి అనేక రకాల వస్తువులు దిగుమతి అవుతున్నాయి. ఇటీవల కాలంలో యుద్ధాలు విపరీతంగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. భారత్ దౌత్య విధానాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక దేశాలలో పర్యటిస్తున్నారు. ఫ్రాన్స్ దేశంలో జరిగే జి7 సమ్మిట్ లో పాల్గొన్న తర్వాత.. పలు దేశాల ప్రతినిధులతో చర్చిస్తారు.
ఇటీవల నరేంద్ర మోడీ నార్వేలో పర్యటించారు. అక్కడ ఓ జర్నలిస్ట్ నరేంద్ర మోడీని ప్రశ్నించింది. ఆ సమయంలో అప్పటికే విలేకరుల సమావేశం ముగియడంతో నరేంద్ర మోడీ వెళ్ళిపోతున్నారు. ఆమె ప్రశ్నించడం వల్లే నరేంద్ర మోడీ వెళ్లిపోయారని వెస్ట్రన్ మీడియా ప్రచారం చేసింది. ఇక మన దేశంలోని ఉదార వాదులు నరేంద్ర మోడీ మీద ఇష్టానుసారంగా నెగిటివ్ ప్రచారం ప్రారంభించారు. విదేశాలతో ఒప్పందాలు.. దౌత్య విధానాలు కుదుర్చుకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ మీద నెగిటివ్ ప్రచారం తీవ్రంగా ప్రభావం చూపించింది.
దీని గమనించిన నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో సరికొత్త విధానానికి శ్రీకారం చెప్పారు. ఒక మాట కూడా మాట్లాడకుండా.. ఫ్రాన్స్ లో అడుగు పెట్టడమే ఆలస్యం.. వెంటనే ఒక చిన్నారిని ముద్దు చేశారు. అక్కడ నైస్ సిటీలో అడుగుపెట్టిన తర్వాత నరేంద్ర మోడీ ముందుగా భారతీయులను కలిశారు. గుజరాత్ నేపథ్యం ఉన్న భారతీయులు నరేంద్ర మోడీని చూడగానే ఆనందంతో ఉప్పొంగిపోయారు. డ్యాన్సులు వేశారు. వాళ్లు డాన్సులు వేస్తుంటే నరేంద్ర మోడీ ఆసక్తిగా గమనించారు.. ఒక చిన్నారిని ముద్దు చేశారు. ఆ చిన్నారి కూడా మోడీ ఆడించినట్టు ఆడుకున్నాడు. కాసేపు ఉన్న ఒత్తిడి మొత్తం పక్కన పెట్టి నరేంద్ర మోడీ ఆనందంగా ఆ బుడ్డోడితో ఆటలాడారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయులను చూడగానే నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. భారతీయులు బలమైన బంధాలను వ్యక్తం చేస్తారని.. ఫ్రాన్స్ దేశంలో వారిని చూడడం ఆనందంగా ఉందని నరేంద్ర మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
నార్వే పర్యటనలో నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో.. ఈసారి అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా నేరుగా భారతీయులను కలిశారు. వారితో మాట్లాడారు. తద్వారా వెస్ట్రన్ మీడియాను దూరం ఉంచారు. ఎందుకంటే డీప్ స్టేట్.. జార్జ్ సోరోస్ వంటి వారు భారత్ మీద విషం చిమ్ముతున్నారు. ఎంత చేయాలో అంత చేస్తున్నారు. ఇదంతా గమనించిన నరేంద్ర మోడీ ప్రతీప శక్తులకు అవకాశం ఇవ్వకుండా ఈసారి కొత్త ప్రణాళిక అమలు చేశారు. దీంతో వెస్ట్రన్ మీడియా అన్ని మూసుకోవాల్సి వచ్చింది.

