https://oktelugu.com/

క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే కలిగే లాభనష్టాలు ఇవే..?

దేశంలో కోట్ల సంఖ్యలో క్రెడిట్ కార్డ్ యూజర్లు క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ యూజర్లకు కొన్ని బ్యాంకులు తక్కువ క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తే మరికొన్ని బ్యాంకులు మాత్రం ఎక్కువ క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులను సక్రమంగా చెల్లిస్తే క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. అయితే క్రెడిట్ కార్డ్ యూజర్లలో చాలామందికి క్రెడిట్ కార్డ్ లిమిట్ కు సంబంధించి అపోహలు ఉన్నాయి. Also Read: […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 25, 2021 / 09:27 PM IST
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో క్రెడిట్ కార్డ్ యూజర్లు క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ యూజర్లకు కొన్ని బ్యాంకులు తక్కువ క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తే మరికొన్ని బ్యాంకులు మాత్రం ఎక్కువ క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డు బిల్లులను సక్రమంగా చెల్లిస్తే క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. అయితే క్రెడిట్ కార్డ్ యూజర్లలో చాలామందికి క్రెడిట్ కార్డ్ లిమిట్ కు సంబంధించి అపోహలు ఉన్నాయి.

    Also Read: సామాన్యులపై అదనపు భారం.. భారీగా పెరిగిన గ్యాస్ ధరలు..?

    చాలామంది క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగితే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తారు. ఈ కారణం వల్లే లోన్ లిమిట్ ను పెంచుకోవాలని అనుకున్నా టెన్షన్ పడతారు. క్రెడిట్ లిమిట్ ను పెంచుకోవడం వల్ల కొన్ని నష్టాలు ఉంటే కొన్ని లాభాలు ఉన్నాయి. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో ఆధారంగా క్రెడిట్ స్కోర్ ను లెక్కిస్తారు. సీయూఆర్ స్థాయి 30 శాతం కంటే తక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్ మెరుగవడంతో పాటు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం సాధ్యమవుతుంది.

    Also Read: రూ.20కే అమెజాన్ ప్రైమ్.. ఓటీపీలతో కొత్తరకం మోసం..?

    ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచాలని కోరినా బ్యాంకులు అంగీకరించని పక్షంలో ఇతర సంస్థల నుంచి క్రెడిట్ కార్డ్ కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. అత్యవసర సమయాల్లో డబ్బులు అవసరమైన వాళ్లు క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటే సులభంగా ఆర్థిక సమస్యల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అకస్మాత్తుగా ఆర్థిక సమస్యలు తలెత్తిన సమయంలో క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎక్కువగా ఉంటే ప్రయోజనం చేకూరుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ ను పెంచడం వల్ల నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. క్రెడిట్ కార్డును తెలివిగా వినియోగించుకోకపోతే అప్పుల భారం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సకాలంలో బిల్లు చెల్లించకపోతే క్రెడిట్ కార్డ్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకోవడం ద్వారా క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే అప్పుల భారం పెరుగుతుంది. ప్రతి నెలా చెల్లింపులు సరైన సమయానికి చెల్లించకపోతే ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌ పై అదనంగా వడ్డీలను చెల్లించాల్సి ఉంటుంది.