సూపర్ స్టార్ మహేష్ అప్ కమింగ్ మూవీ “సర్కారు వారి పాట.” టైటిల్ తోనే క్యూరియాసిటీ పెంచేసిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ప్రిన్స్ మూవీ కావడంతో.. ఎలాంటి రిజల్ట్ నమోదు చేస్తుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
వరుస విజయాలతో దూకుడు మీదున్న మహేష్.. ఎవరికి ఛాన్స్ ఇస్తాడు? ఎలాంటి సినిమాను అనౌన్స్ చేస్తాడు? అని ఎదురు చూశారు ఫ్యాన్స్. అయితే.. పరశురామ్ కు అవకాశం ఇచ్చిన మహేష్.. “సర్కారు వారి పాట”అంటూ డిఫరెంట్ టైటిల్ ను యాక్సెప్ట్ చేశాడు. దీంతో.. అనౌన్స్ తోనే హైప్ క్రియేట్ చేసింది ఈ చిత్రం.
వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. అయితే.. రిలీజ్ డేట్ కు చాలా సమయం మిగిలి ఉండడంతో.. షూట్ కు కావాల్సినంత సమయం దొరికిందని అందరూ అనుకుంటున్నారు. కానీ.. ప్రిన్స్ లెక్కలు వేరే ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ఫినిష్ చేయాలని చూస్తున్నాడు మహేష్.
వాస్తవానికి ఈ సినిమా షూట్ మొత్తం సమ్మర్ ముగిసేలోపు పూర్తి చేయాలని అనుకుంటున్నాడట మహేష్. కానీ.. సాధ్యం కాదని తేలిపోయింది. అందువల్ల.. దసరా నాటికైనా ఈ సినిమాను ఫినిష్ చేయాలని చూస్తున్నాడట. ఎందుకు ఇంతగా త్వరపడుతున్నాడని ఆరాతీస్తే.. ఇంట్రస్టింగ్ పాయింట్ తేలింది.
మహేష్-రాజమౌళి కాంబోలో ఓ చిత్రానికి ప్లాన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్రం మొదలవ్వాలంటే.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ కావాలి. ఆ సినిమా వచ్చే దసరా రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ రిలీజ్ తర్వాత ప్రీ – ప్రొడక్షవర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతగానీ మెగా ఫోన్ పట్టుకోడు జక్కన్న.
కాబట్టి.. ఈ ‘సర్కారు వారి పాట’ను త్వరగా ఫినిష్ చేస్తే.. రాజమౌళితో సినిమా స్టార్ట్ అయ్యేలోపు.. మధ్యలో ఓ సినిమా లాగించేయొచ్చు అని చూస్తున్నాడట మహేష్. జక్కన్నతో సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ప్రారంభం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి.. వీలైనంత త్వరగా ఈ సినిమాను క్లోజ్ చేసి, మరో సినిమాను కూడా రిలీజ్ చేసేయొచ్చని లెక్కలు వేస్తున్నాడట మహేష్.
దీనికోసం త్వరగా సినిమాను ఫినిష్ చేసే దర్శకులను కూడా లిస్ట్ ఔట్ చేశాడట. అనిల్ రావిపూడిని మళ్లి లైన్లో పెట్టాలా..? లేదంటే ‘భీష్మ’ వంటి హిట్ ఇచ్చి, మహేష్ కోసం వెయిట్ చేస్తున్న వెంకీ కుడుములను తీసుకోవాలా? అని చూస్తున్నాడట. మరి, ఏం జరుగుతుంది? ‘సర్కారువారి పాట’ తర్వాత మధ్యలో ఒక సినిమా చేస్తాడా? లేదంటే.. నేరుగా జక్కన్న సినిమానే చేస్తాడా? అన్నది చూడాలి.