ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ కార్డు ఉంటే అనేక ప్రయోజనాలు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్బీఐ కార్డు వినియోగించే వాళ్ల కోసం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో కాంటాక్ట్ లెస్ పేమెంట్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. స్వైప్ మెషీన్ లో కార్డును కూడా పెట్టకుండా కస్టమర్లు సులభంగా ఫోన్ ద్వారానే లావాదేవీలను జరపవచ్చు. Also Read: రైతులకు గుడ్ న్యూస్.. సులభంగా రూ.5 లక్షలు […]

Written By: Navya, Updated On : November 26, 2020 12:31 pm
Follow us on


దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎస్బీఐ కార్డు వినియోగించే వాళ్ల కోసం కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో కాంటాక్ట్ లెస్ పేమెంట్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. స్వైప్ మెషీన్ లో కార్డును కూడా పెట్టకుండా కస్టమర్లు సులభంగా ఫోన్ ద్వారానే లావాదేవీలను జరపవచ్చు.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. సులభంగా రూ.5 లక్షలు లోన్ పొందే ఛాన్స్..?

జేబులో క్రెడిట్, డెబిట్ కార్డ్ లేకపోయినా ఆన్ లైన్ ద్వారానే సులభంగా లావాదేవీలను నిర్వహించడం సాధ్యమవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ కార్డ్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో మాస్టర్ కార్డ్ తో జత కట్టి ఎస్బీఐ ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్లను అందిస్తున్న తొలి క్రెడిట్ కార్డ్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ కొత్త సర్వీసులను వినియోగించుకునే కస్టమర్లను జేబులో కార్డ్ లేకపోయినా సులభంగా లావాదేవీలను జరపవచ్చు.

Also Read: పోస్టాఫీస్ బంపర్ ఆఫర్.. రూ.300 చెల్లిస్తే రూ.2 లక్షలు మీ సొంతం..!

కాంటాక్ట్ లెస్ టెర్మినల్ దగ్గర సులభంగా మొబైల్ ఫోన్ ను వినియోగించి లావాదేవీలను పూర్తి చేయడం సాధ్యమవుతుంది. 2,000 రూపాయల లోపు లావాదేవీలకు పిన్ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. 2,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం లావాదేవీలకు మాత్రం పిన్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులు ఈ సర్వీసులను పొందవచ్చు.

మరిన్ని జనరల్ వార్తల కోసం: ప్రత్యేకం

ఎస్‌బీఐ కార్డ్ మొబైల్ యాప్‌ను వినియోగించి కస్టమర్లు సులభంగా లావాదేవీలను జరపవచ్చు. ఫోన్‌లో ఎన్ఎఫ్‌సీ ఉంటే మాత్రమే కాంటాక్ట్ లెస్ లావాదేవీలు చేయడం సాధ్యమవుతుంది. ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేసేవాళ్లకు కాంటాక్ట్ లెస్ లావాదేవీల ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.