https://oktelugu.com/

టీఆర్ఎస్ వ్యూహానికి బీజేపీ సెల్ఫ్ గోల్..!

జీహెచ్ఎంసీ ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చేదు అనుభవం ఎదురవడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈమేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న బీజేపీని మెల్లిగా ముగ్గులోకి సెల్ఫ్ గోల్ చేసుకోనేలా చేస్తోంది. Also Read: తెలంగాణలో ఆంధ్ర పార్టీలకే స్పేస్‌ లేనట్లే.. హైదరాబాద్లో ముస్లిం ఓటు బ్యాంకు చాలా కీలకం. ఇక్కడ హిందువుల కంటే ముస్లింల జనాభే ఎక్కువ. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 7:51 pm
    Follow us on

    BJP vs TRS

    జీహెచ్ఎంసీ ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చేదు అనుభవం ఎదురవడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఈమేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకెళుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న బీజేపీని మెల్లిగా ముగ్గులోకి సెల్ఫ్ గోల్ చేసుకోనేలా చేస్తోంది.

    Also Read: తెలంగాణలో ఆంధ్ర పార్టీలకే స్పేస్‌ లేనట్లే..

    హైదరాబాద్లో ముస్లిం ఓటు బ్యాంకు చాలా కీలకం. ఇక్కడ హిందువుల కంటే ముస్లింల జనాభే ఎక్కువ. తొలి నుంచి బీజేపీ హిందుత్వాన్ని భుజాన మోస్తోంది. అయితే టీఆర్ఎస్-బీజేపీ మాటల యుద్ధంలో భాగంగా కమలం పార్టీ నేతలు పాతబస్తీ మీద సర్జికల్ స్ట్రయిక్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆ పార్టీకి సెల్ఫ్ గోల్ అనే టాక్ విన్పిస్తోంది.

    హైదరాబాద్లో ముస్లింలు.. హిందువులు ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. బీజేపీ వ్యాఖ్యల వల్ల హిందుత్వ ఓట్లు గంపగుత్తగా వచ్చే పరిస్థితి లేదు. అయితే బీజేపీ మాత్రం ముస్లిం వ్యతిరేక పార్టీగా ముద్రవేయించుకుంటోంది. దీనిని టీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. బీజేపీ వ్యాఖ్యలను పదేపదే వల్లేవేస్తూ నగరంలోని ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడుతుందనే సంకేతాలను పంపుతోంది.

    Also Read: టీడీపీకి కొరకరాని కొయ్యలా బీజేపీ

    బీజేపీ తన తప్పును సరిదిద్దుకోవాల్సిందిపోయి దానిని కంటిన్యూ చేస్తుండటం టీఆర్ఎస్.. ఎంఐఎం పార్టీలకు కలిసి వచ్చేలా కన్పిస్తోంది. కొద్దిరోజులుగా పాతబస్తీలో ఎంఐఎంపై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లిం ఓటర్లంతా మళ్లీ ఎంఐఎంనే అక్కున చేర్చుకునేలా కన్పిస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్ వ్యూహానికి బీజేపీ సెల్ఫ్ గోల్ అయ్యేలా కన్పిస్తోంది. పక్కా స్ట్రాటజీతో వెళుతున్న టీఆర్ఎస్ ను బీజేపీ ఏమేరకు నిలువరిస్తుందో వేచిచూడాల్సిందే..!

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్