మనలో చాలామంది చిప్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. రోడ్ సైడ్ షాపుల్లో దొరికే చిప్స్ తో పాటు బ్రాండెడ్ కంపెనీల ప్యాకెట్లలో దొరికే చిప్స్ ను తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే చిప్స్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు గ్యారంటీగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంలో పిల్లలు ఆలూ చిప్స్ ను ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఈ చిప్స్ తింటే బరువు పెరగడంతో ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.
రంగురంగుల ప్యాకెట్లలో కనిపించే చిప్స్ చాలారోజులైనా రంగు మారకుండా ఉంటాయి. ఇలా రంగు మారకుండా ఉండటానికి అసలు కారణం వేరే ఉంది. రంగురంగుల ప్యాకెట్లలోని చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు సోడియం బై సల్ఫైట్ అనే కెమికల్ ను ఉపయోగిస్తారు. ఈ కెమికల్ వల్ల ప్యాకెట్లలో క్రిముల పెరుగుదల ఆగినా అదే సమయంలో సల్ఫర్ డై యాక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది.
యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్లు సోడియం బై సల్పైట్ ఒక డ్రై యాసిడ్ అని దాని వల్ల ఆస్తమా, డయేరియా, ఛాతీ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అందంగా కనిపించే ప్యాకెట్లలోని చిప్స్ ఎక్కువగా తింటే ఇతర ఆరోగ్య సమస్యలు సైతం వేధించే అవకాశం ఉంటుంది. అందువల్ల వీలైనంత వరకు పిల్లలు చిప్స్ కు దూరంగా ఉంటే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
తల్లిదండ్రులు పిల్లలకు ఏవైనా కావాలంటే వాటిని వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం మంచిది. ప్యాకేజ్ ఫుడ్ పిల్లలకు ఏ మాత్రం ఆరోగ్యకరం కాదు. ప్యాకేజ్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరవు. అందువల్ల వీలైనంత వరకు అలాంటి ప్యాకేజ్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది.