Homeఆంధ్రప్రదేశ్‌Sankranti Festival Specialty : సంక్రాంతి విశిష్టత, ఈ రోజున చేయాల్సిన దానాలేంటో మీకు తెలుసా?

Sankranti Festival Specialty : సంక్రాంతి విశిష్టత, ఈ రోజున చేయాల్సిన దానాలేంటో మీకు తెలుసా?

sankranti festival specialty and donations : ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే చక్కటి పండుగు ‘సంక్రాంతి’. ఈ ఫెస్టివల్ కోసం అందరూ తమ సొంతూళ్లకు వెళ్తుంటారు. మూడు లేదా నాలుగు రోజుల పాటు ఎంచక్కా హాయిగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు చేసుకుంటుంటారు. కాగా, ఈ రోజు విశిష్టత, ఈ రోజున ప్రతీ ఒక్కరు ఏం చేయాలనే సంగతులు తెలుసుకుందాం.

bhogi-jpg

సంక్రాంతి పర్వదినాన పాతతనానికి వీడ్కోలు పలికి, కొత్తదనానికి స్వాగతం పలకాలని పెద్దలు చెప్తుంటారు. సంక్రాంతి పండుగ వచ్చే నాటి పంటల కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి చేరుతుంది. ఈ నేపథ్యంలో పొలాల్లో ఉండే కీటకాలు ఇళ్లలోకి రాకుండా ఉండేందుకుగాను వాకిళ్లలో కల్లాపి చల్లుతారని పెద్దలు వివరిస్తున్నారు. ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తుంటారు.

సంక్రాంతి పర్వదినానా సూర్యుడి సంక్రమణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున కొందరు పూజలు కూడా చేసుకుంటారు. ఇకపోతే ఈ రోజున దానాలు చేస్తే కనుక పుణ్యం లభిస్తుంది. సామాన్య రోజులలో కంటే ఈ రోజున దాన ధర్మాలు చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుందని పెద్దలు పేర్కొంటున్నారు. మన పూర్వీకులతో పాటు, పితృదేవతలకు దానం చేయాలి. అన్నదానం, భూదానం, వెండిదానం, సువర్ణదానం, పుస్తకదానం, పప్పు, ఉప్పు, బియ్యం, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే చాలా చక్కటి ప్రయోజనాలుంటాయి.

ఈ పండుగరోజున ఇళ్లల్లో చక్కగా అలంకరణ చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ పెట్టి, వాకిట్లో ముగ్గులు వేసి..వాటిలో ఆవు పేడ, గొబ్బెమ్మలు పెట్టడంతో పాటు ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేయాలని, ఆ తర్వాత శ్రీమన్నారాయణుడిని ఆరాధించాలని పెద్దలు చెప్తున్నారు. ఇదంతా కూడా శాస్త్రాల్లో ఉందని వివరిస్తున్నారు. పిండి వంటకాలను ఆరగించడంతో పాటు దానం కూడా చేయాలని సూచిస్తున్నారు. ఇకపోతే ఈ పర్వదినాన అందరూ కొత్త బట్టలు ధరించి దేవుడిని మనసులో స్మరణ చేసుకుని తమ పనులు మొదలుపెట్టుకుంటే చాలా మంచిది. ఈ రోజున నూతన వస్తువుల కొనుగోలు చేయడం కూడా మంచిదే.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

2 COMMENTS

  1. […] Omicron: కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ వ్యాప్తి కట్టడికి భారత్‌లోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూలు విధించడంతో పాటు వీకెండ్ లాక్ డౌన్లు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం పిల్లపైన ఏ మేరకు పడుతుంది? ఈ విషయమై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. Also Read:  చంద్రబాబు మారారు.. ఇది చూస్తే నిజం అంటారు? దేశరాజధాని ఢిల్లీ ఎయిమ్స్ ఈ విషయమై సెమినార్ నిర్వహించారు. వైద్యులు, పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొని థర్డ్ వేవ్ లో పిల్లలపై ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం గురించి పలు విషయాలను తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగ వ్యాప్తి చెందడం వలన అది పిల్లలకూ వస్తున్నదని వివరించారు వైద్యులు. అయితే, చాలా మంది ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, అందు వల్లే వ్యాప్తి ఇంకా ఎక్కువవుతున్నదని పేర్కొంటున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు అయితే కొవిడ్ మహమ్మారి బారిన పడిన పిల్లల సంఖ్య అయితే అంత గణనీయంగా పెరగలేదని తెలుస్తోందని వివరించారు. భారతదేశంలో ఇప్పటికయితే పిల్లకు అంత స్థాయిలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపలేదు. కానీ, అగ్రరాజ్యం అమెరికాలో చిన్నారులపైన ఈ వేరియంట్ ప్రభావం చూపుతోంది. పలు రుగ్మతలతో బాధపడుతున్నవారు వైరస్ బారిన పడితే కోలుకోవడానికి కొంచెం కష్టమవుతుందని తెలిపారు. డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొంచెం తీవ్రంగా ఉన్నదని అంటున్నారు. అమెరికాలో ఇప్పటికే చాలా మంది చిన్నారుల ఈ వేరియంట్ బారిన పడ్డారని తెలిపారు. ఈ క్రమంలోనే పిల్లలైనా పెద్దలైనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, మాస్కు కంపల్సరీగా ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే కొన్ని దేశాలు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్ కూడా ఇస్తున్నారు. భారత్‌లోనూ పలు చోట్ల బూస్టర్ డోసు పంపిణీ స్టార్ట్ అయింది. బూస్టర్ డోస్ పంపిణీ ద్వారా హ్యూమన్ బాడీలో ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పవర్ వస్తుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. Also Read:  సంక్రాంతికి ప్రత్యేకంగా తెలుగు వారు చేసే వంటకాలు, వాటి ప్రత్యేకతలు ఇవే.. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular