Unstoppable With NBK- Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ చివరి ఎపిసోడ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే..ఈరోజు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది..ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొంటాడు అని అందరూ అనుకున్నారు..కానీ చివరి నిమిషం లో ఏమి జరిగిందో తెలియదు కానీ ఆయన బదులుగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రాబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ ఎపిసోడ్ ని వీక్షించేందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ కి వేలాది సంఖ్య లో చేరారు..పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అని తెలుకున్న అభిమానులు తెల్లవారుజాము నుండే అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట పడిగాపులు కాయడం ప్రారంభించారు..దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అంతే కాకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఒక పోస్టర్ ని కూడా విడుదల చేయబోతున్నారట.
పవన్ కళ్యాణ్ తన కెరీర్ మొత్తం మీద పాల్గొంటున్న ఏకైక టాక్ షో ఇది..దీనితో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడబోతున్నాడు..ఆయనని బాలయ్య బాబు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నాడు..పవన్ కళ్యాణ్ లోని ఫన్ యాంగిల్ పూర్తిగా ఈ షో ద్వారా బయటపడబోతుందా వంటి అరుదైన ఘట్టాల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు..ఈ ఎపిసోడ్ వచ్చే నెల సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ అవ్వబోతుందని సమాచారం.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఆహా మీడియా కి వస్తున్నాడు అంటే ఆహా ని వీక్షించే వినియోగదారుల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోవడం ఖాయం..త్వరలోనే ప్రభాస్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కాబోతుంది..ఇలా ఒకేసారి ఇండస్ట్రీ చెందిన టాప్ 2 హీరోలు ఈ షో కి రావడం వల్ల ఆహా మీడియా వేరే లెవెల్ కి వెళ్లబోతుందని, అల్లు అరవింద్ ఖాతాలో మరో సంచలనాత్మకమైన ప్రాజెక్ట్ గా ఆహా నిలిచిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.