RRR Team Surprise: రాజమౌళి సినిమా అంటేనే అంకితం కావాల్సిందే.. ప్రభాస్ అయితే పెళ్లిని కూడా వాయిదా వేసేసి బాహుబలి కోసం ఐదేళ్లు జక్కన్నకు అంకితమిచ్చాడు. ఇక ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రాంచరణ్ లు ఓ మూడేళ్లు కేటాయించారు. మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ రాజమౌళి ప్రతీ ఫ్రేమును అలా చెక్కుతుంటాడు. అందుకే అన్ని ఏళ్లు సినిమా పడుతుంది.అంత క్లారిటీగా వస్తుంది.

అందుకే షూటింగ్ లో రాజమౌళి చెప్పేవన్నీ చేస్తూ షూటింగ్ గ్యాప్ లో ఇలా మన హీరోలు సేదతీరారు. రాంచరణ్, ఎన్టీఆర్ లు షూటింగ్ గ్యాప్ లో పచ్చగా పరుచుకున్న గడ్డిపై సేదతీరుతూ ఫోన్లలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో.. ఇతర వ్యాపకాల్లో బిజీ అయిపోయారు. ‘స్క్రోలింగ్ వెన్ కెమెరా ఈజ్ నాట్ రోలింగ్’ అంటూ కెమెరా ఆఫ్ లో ఉన్న మన హీరోలు ఏం చేస్తున్నారనే దానిపై ఓ ఫొటోను ఆర్ఆర్ఆర్ టీం తాజాగా విడుదల చేసి ఈ కామెంట్ చేసింది.
Also Read: రామారావ్ ఆన్ డ్యూటీ: నేరస్తుల తాట తీస్తున్న రవితేజ
ఇక ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా మార్చి 25న విడుదల చేయనున్నట్టు ఆర్ఆర్ఆర్ టీం అధికారికంగా ప్రకటించింది. ప్రచార కార్యక్రమాలను షూరు చేసేందుకు రెడీ అయ్యింది. ‘మార్చి ఈజ్ హియర్’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆర్ఆర్ఆర్ టీం తాజాగా విడుదల తేదీని ఖాయం చేసి ట్రెండ్ చేసింది. నెటిజన్లు కామెంట్స్ సెక్షన్ లో ఫొటోలను ఫిల్టర్ తో కలిపి నింపేయాలని.. యూనిక్ ఫిల్టర్ అంటే ఏమిటో వివరిస్తూ మరో ట్వీట్ చేశారు.
Scrolling when camera isn’t Rolling 👻 #RRRMovie#MaRRRchIsHere 🔥🌊 pic.twitter.com/Rh9xYKhVGL
— RRR Movie (@RRRMovie) March 1, 2022
జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీంగా.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న ఈ మూవీలో ఆలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రధారులు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది.
MaRRRching towards the 25th!! 🐎🏍 #RRRMovie
Click a snap and slide for ‘MARRRCH IS HERE’ sticker on Snapchat across India🇮🇳
Share it to your streak partners and post your snaps on your walls with #MaRRRchIsHere 🔥🌊
Official Page – https://t.co/XEbPumhUX3 pic.twitter.com/1godorVAqt
— RRR Movie (@RRRMovie) March 1, 2022
Also Read: పూరి జగన్నాథ్ భార్యకి చిరంజీవి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా?
Recommended Video:

[…] Also Read: RRR Team Surprise: ఆర్ఆర్ఆర్ నుంచి అభిమానులకు మర… […]