https://oktelugu.com/

Trisha Marriage: ఆ సీనియర్ హీరోయిన్ పెళ్లి బాజాలు మోగనున్నాయా ?

Trisha Marriage: సీనియర్ హీరోయిన్ త్రిషకి సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేయాలనుకున్నారట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అంతలో త్రిష సినిమాల్లోకి రావడం.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అంతలో త్రిష కెరీర్ కూడా చాలా కాలం పాటు సాగింది. ఇంతలో ఆమె వయసు కూడా చాలా ముందుకు వచ్చేసింది. తెలియకుండానే త్రిష వయసు రెండేళ్లు తక్కువ నలభైకి వచ్చేసింది. నలభై అంటే బాగా పెరిగిపోయినట్టే. అందుకే త్రిష పెళ్లి మీద సోషల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 1, 2022 / 03:56 PM IST
    Follow us on

    Trisha Marriage: సీనియర్ హీరోయిన్ త్రిషకి సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేయాలనుకున్నారట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. కానీ అంతలో త్రిష సినిమాల్లోకి రావడం.. తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. అంతలో త్రిష కెరీర్ కూడా చాలా కాలం పాటు సాగింది. ఇంతలో ఆమె వయసు కూడా చాలా ముందుకు వచ్చేసింది. తెలియకుండానే త్రిష వయసు రెండేళ్లు తక్కువ నలభైకి వచ్చేసింది.

    Trisha

    నలభై అంటే బాగా పెరిగిపోయినట్టే. అందుకే త్రిష పెళ్లి మీద సోషల్ మీడియాలో చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇంతవరకు త్రిష పెళ్లి పై మాత్రం ఎవరికీ క్లారిటీ రాలేదు. అయితే మరోసారి త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విక్రమ్ అనే తమ దగ్గరి బంధువును త్రిష పెళ్ళి చేసుకోబోతుందని ఆ వార్తల సారాంశం.

    Also Read: బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసిన ‘రౌడీ బాయ్స్‌’ ఓటీటీలో హిట్ అవుతారా ?

    ఇప్పటికే ఎన్నో సార్లు త్రిష డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా రానాతో త్రిష ప్రేమలో ఉన్నట్లు ఏళ్ళ తరబడి గాసిప్పులు పుట్టుకొచ్చాయి. కానీ రానా పెళ్లి అయ్యిపోయింది. అయితే, ఈ విషయం పై రానాతో పాటు త్రిష కూడా మా మధ్య ప్రేమ ఏమి లేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. ఆ రూమర్లు మాత్రం ఆగలేదు. అయితే తాజాగా త్రిష పెళ్లికి సిద్ధమవుతునట్లు ఓ రూమర్ బాగా వైరల్ అవుతోంది.

    Trisha

    ఇప్పటికే త్రిష కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లు.. త్వరలోనే పెళ్లికి సంబంధించిన అప్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే త్రిష కూడా కొత్త సినిమాలు ఒప్పుకోవట్లేదు అట. గత ఏడాది అఫీషియల్ గా త్రిష ఒక తమిళ సినిమాకి సైన్ చేసింది. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.

    అయితే, రీసెంట్ గా సూర్య కొత్త సినిమాలో అవకాశం వచ్చినా త్రిష ఒప్పుకోలేదు అట. కేవలం పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే త్రిష సినిమాలు ఒప్పుకోవడం లేదు అని చాలా బలంగా వినిపిస్తోంది. మరి ఈ సారైనా త్రిష పెళ్లి బాజాలు మోగుతాయేమో చూడాలి.

    Also Read:  సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

    Tags