YS Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం సంచలనంగా మారుతోంది. ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న సీబీఐ ప్రస్తుతం వేగం పెంచుతోంది. మొదట్లో నెమ్మదించినా ఇప్పుడు కేసు దర్యాప్తులో చురుకుగా కదులుతోంది. గతంలో ఏ రహస్యమైనా బయటకు రానిది ప్రస్తుతం అన్ని క్షణాల్లో బహిర్గతమవుతున్నాయి. కేసు ముందుకు కదలడం వెనుక బీజేపీ పాత్ర కూడా ఉందని పలువురు అనుమానిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు ప్రారంబించింది. దీంతో కొన్నాళ్లు కేసు పురోగతి సాధించకపోయినా ఇప్పుడు మాత్రం వేగం పెంచిందని తెలుస్తోంది.
సీబీఐ విచారణ చేపట్టిన కొత్తలో ఏ విషయం కూడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని రహస్యాలు బహిర్గతం అవుతున్నాయి. వాంగ్మూలాలు, చార్జీషీట్లు, సాక్షుల వివరాలు అన్ని కూడా ఇట్లే తెలిసిపోతున్నాయి. దీంతో కేసును ప్రజల మధ్యకే తీసుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిందితులెవరో ప్రజలే నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికంతటికి కారణం కేంద్ర ప్రభుత్వమనే వాదన కూడా వస్తోంది.
Also Read: దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్.. కేసీఆర్‌కు పెద్ద ఆయుధం దొరికిందిగా..!
సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత ఎక్కడ కూడా సీబీఐకి వ్యతిరేకంగా కొందరు వ్యవహరించారనే ప్రచారం సాగుతోంది. అందుకే సీబీఐ ఈ కేసులో ముందుకు వెళుతోందని సమాచారం. దీంతోనే వివేకా హత్య కేసులో ప్రస్తుతం వేగం పెరిగిందని తెలుస్తోంది. వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి సైతం సీఎం జగన్ పాత్ర ఈ కేసులో ఉన్నట్లు అనుమానించడం సంచలనం కలిగిస్తోంది.
సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగానే ఇన్నాళ్లు కేసును ముందుకు వెళ్లనీయలేనే ఆరోపణలు సైతం వచ్చాయి. కానీ బీజేపీకి జగన్ కు మధ్య దూరం పెరుగుతుండటంతో కేసు ఇక వేగవంతమవుతుందని ప్రచారం సాగుతోంది. కేంద్రం ఆధీనంలో ఉండే సీబీఐ ఇప్పుడు మరింత వేగంగా దర్యాప్తు ముమ్మరం చేస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు.
రాజకీయ ప్రభావాలు కూడా మారనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన వివేకా హత్య కేసు సీబీఐ ఇక వేగంగా ముందుకు నడిపించి దోషులను తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
Also Read: ఉక్రెయిన్ యుద్ధం: రష్యా తగ్గడం లేదు..