https://oktelugu.com/

RRR: ‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ.. – సినిమా ఎలా ఉందంటే.. ?

RRR: క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడినా.. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే, సినిమాని పోస్ట్ ఫోన్ చేసిన నేపథ్యంలో సెన్సార్ రిపోర్ట్ ను చిత్రబృందం బయట పెట్టలేదు. అందుకే, ఈ సినిమాకి ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేశారో తెలియ లేదు. కానీ.. రాజమౌళి సెన్సార్ సర్టిఫికెట్ బయట పడకుండా జాగ్రత్త పడినా.. సెన్సార్ రివ్యూను మాత్రం ఆపలేకపోయాడు. ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు […]

Written By:
  • Shiva
  • , Updated On : January 13, 2022 / 12:27 PM IST

    RRR Record

    Follow us on

    RRR: క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడినా.. ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే, సినిమాని పోస్ట్ ఫోన్ చేసిన నేపథ్యంలో సెన్సార్ రిపోర్ట్ ను చిత్రబృందం బయట పెట్టలేదు. అందుకే, ఈ సినిమాకి ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేశారో తెలియ లేదు. కానీ.. రాజమౌళి సెన్సార్ సర్టిఫికెట్ బయట పడకుండా జాగ్రత్త పడినా.. సెన్సార్ రివ్యూను మాత్రం ఆపలేకపోయాడు.

    RRR

    ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు ‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ గురించి ఒక ట్వీట్ చేశాడు. ఇంతకీ ఏమి చేశాడు అంటే.. ‘మైండ్ బ్లోయింగ్.. జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్’ అంటూ ఒక ఫైర్ ఎమోజీని కూడా పోస్ట్ చేశాడు. ఫిల్మ్ క్రిటిక్ గా ఉమైర్ సంధుకు మంచి నేమ్ ఉంది. గతంలో అతను ముందుగానే ‘దంగల్, బాహుబలి 2’ సినిమాల విషయంలో ఇలాగే రివ్యూ ఇచ్చాడు. అవి నిజం అయ్యాయి కూడా. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా నిజం అవుతుందని నమ్మకం ఉంది.

    Also Read: ఏపీ సర్కార్ ‘పీఆర్సీ’ ఫైట్ కు మళ్లీ సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులు

    దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్ ను హైలైట్ చేయడానికి మొదటి నుంచి క్రేజీగా ప్లాన్ చేస్తూ వచ్చాడు. పైగా ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుంది. దీనికితోడు ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ లు అద్భుతంగా ఉంటాయట. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో ఎన్టీఆర్ డైలాగ్ లే మెయిన్ హైలెట్ అవుతాయని కూడా గతంలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా గొప్పగా ఉంటాయట.

     

    అన్నిటికి మించి ఎన్టీఆర్ ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడట. ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ ను బట్టి.. సినిమాలో ఎన్టీఆర్ మాత్రమే మెయిన్ హైలైట్ కాబోతున్నాడు అన్నమాట. అలాగే ‘ఎన్టీఆర్ – ఓలివియా’ లవ్ ట్రాక్ కూడా బాగా హైలైట్ గా ఉంటుందట. వీరి మధ్య ఎక్కడా సింగిల్ డైలాగ్ కూడా ఉండడు అట.

    కేవలం వారి మధ్య చోటు చేసుకున్న కొన్ని సంఘటనల కారణంగా ఓలివియా, ఎన్టీఆర్ పై ఘాడమైన ప్రేమను పెంచుకుంటుంది. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ఆమె తన ప్రాణాలను సైతం అర్పిస్తోంది. ఓలివియా త్యాగంతో ముగిసే వీరి ట్రాక్ సినిమాలోనే హెవీ ఎమోషనల్ హైలైట్ కానుంది. ఎన్టీఆర్ – చరణ్ మొదటి సారి కలుసుకునే సన్నివేశం కూడా గూస్ బంప్స్ వస్తాయట.

    అలాగే పులితో ఎన్టీఆర్ చేసే ఫైట్ కూడా సినిమాలో మరో ప్రధాన హైలైట్ కానుంది. కాగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అన్ని ఇండస్ట్రీల నుండి ఈ సినిమా పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read:  తమిళంలోకి ‘ఆహా’.. ఇక్కడ బాలయ్య – బన్నీ.. అక్కడ విజయ్ కాంత్ – సూర్య !

    https://twitter.com/UmairSandu/status/1480843026201202693

    Tags