Aha: తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ తమిళంలోకి కూడా వెళ్లబోతుంది. ఈ నెల 28న ‘ఆహా’ తమిళంలో స్టార్ట్ చేస్తున్నారు. తమిళ హీరో శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఇరై’ వెబ్ సిరీస్ ను తమిళ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమ్ కాబోతుంది. ఇప్పటికే తమిళం నుంచి కూడా ‘ఆహా టీమ్’ భారీ ఎత్తున కంటెంట్ ను కొనుగోలు చేసింది, ఇంకా చేయబోతోంది. ముఖ్యంగా తమిళ సినిమాలను, వెబ్ సిరీస్ లతో పాటు టాక్ షోస్ ను కూడా ఆహా టీమ్ ప్లాన్ చేస్తోంది.
తెలుగులో బాలయ్యతో చేసిన విధంగానే.. తమిళంలో విజయ్ కాంత్ తో ఓ టాక్ షోను ప్లాన్ చేయాలని చూస్తున్నారు. విజయ్ కాంత్ తో షో ప్లాన్ చేస్తే.. కచ్చితంగా హిట్ అవుతుంది. ఇక తెలుగులో ‘ఆహా’కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అదే తరహాలో ‘ఆహా’ తమిళానికి కూడా ఓ తమిళ స్టార్ హీరోను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవాలనుకుంటున్నారు.
Also Read: ‘హరిహర వీరమల్లు’ స్టోరీని లీక్ చేసిన హీరోయిన్.. వైరల్..!
హీరో సూర్యతో ఇప్పటికే ఆ విషయంలో చర్చ కూడా జరిపారని తెలుస్తోంది. మరి తెలుగులో లాగానే తమిళంలోనూ ‘ఆహా’.. ఆహా అనిపిస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా తెలుగు ఏకైక ఓటీటీగా ప్రత్యేకతను తెచ్చుకున్న ‘ఆహా’ సక్సెస్ వెనుక ఎన్ని కారణాలు ఉన్నా.. అందులో ప్రధాన కారణం మాత్రం లాక్ డౌన్ టైమ్. కరెక్ట్ గా ఆహా వచ్చే టైంకు కరోనా వచ్చి, జనాన్ని ఇంట్లోనే కూర్చోబెట్టింది.
ఖాళీగా ఉన్న నెటిజన్లకు ఆహా ఎంటర్టైన్మెంట్ గా అనిపించడంతో, చకచకా జనాల్లోకి ఆహా వెళ్లడానికి ఈజీ అయిపోయింది. మరి ఇప్పుడు తమిళంలో ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి. తమిళంలో కనీస పెట్టుబడి 400 కోట్ల వరకు అవుతుందని టాక్. పైగా అది కూడా సినిమాలు కొనడానికే, మళ్ళీ ఎలాగూ సినిమాలు కొత్తవి వస్తూనే ఉంటాయి, అవి కూడా కొంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు ఓటీటీను అప్ డేట్ చేస్తూ ఉండాలి. కాబట్టి, పెట్టుబడి అనేది పెరుగుతూనే ఉంటుంది. అందుకే తమిళంలో కూడా భారీ పెట్టుబడులు పెడుతున్నారట.
Also Read: ఏపీ సర్కార్ ‘పీఆర్సీ’ ఫైట్ కు మళ్లీ సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులు