RK Kotha Paluku: పాత్రికేయులకు కొన్ని విషయాలు రాయాలంటే భయం ఉంటుంది.. అన్నింటికీ మించి ఎటునుంచి ఎలాంటి మాట వస్తుందోనని ఆందోళన ఉంటుంది.. కానీ ఈ విషయాలకు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ అతీతుడు. అందుకే మొహమాటం లేకుండా రాసేస్తుంటాడు. అతడి పాత్రికేయంలో బ్యూటీ కూడా అదే. గత ఆదివారం ఎందుకో విరామం ఇచ్చిన అతడు ఈ వారం కొత్త పలుకులో కొన్ని సంచలన రాజకీయ విషయాలు వెల్లడించాడు..ఆఫ్ కోర్స్ అవి ప్రో టిడిపి కోణంలో సాగినప్పటికీ కొన్ని కీలక విషయాలను మాత్రం మొహమాటం లేకుండా రాసేసాడు. బహుషా ఎన్నికల ముందు వీటిని వైసిపి తెగ ట్రోల్ చేసే అవకాశం లేకపోలేదు. తెలంగాణ ఎన్నికల్లో ఓటమికి సంబంధించి కెసిఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అని వ్యాసాన్ని మొదలుపెట్టిన రాధాకృష్ణ.. ఆంధ్రలోనూ ఆ ప్రభావం ఉండకూడదని ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చుతున్నాడని రాధాకృష్ణ రాశాడు.. సరే జగన్ విషయం పక్కన పెడితే బాలకృష్ణ హిందూపురం వాస్తవ్యుడు కాదు. లోకేష్ మంగళగిరిలో పుట్టలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే టిడిపిలో పెద్ద జాబితానే ఉంది. మరి అలాంటప్పుడు జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నది నేరం ఎలా అవుతుంది? ఎవరైనా అధికారంలోకి రావాలనే కదా కోరుకుంటారు.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో అందుకే కదా పొత్తు పెట్టుకున్నాడు.. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందుకు అతీతుడు ఎలా అవుతాడు?
పదేపదే వైసిపి ట్రోల్ చేయడం ద్వారా లోకేష్ లో మెచ్యూరిటీ వచ్చిందని రాధాకృష్ణ రాస్కొచ్చాడు. అంటే గతంలో మెచ్యూరిటీ లేదననే అర్థం. ఆ లెక్కన చూసుకుంటే టిడిపి ప్రభుత్వ హయంలో ఆయనను ఎమ్మెల్సీ చేసి ఐటీ, పురపాలక శాఖలకు మంత్రిని ఎందుకు చేసినట్టు? మెచ్యూరిటీ లేని వ్యక్తికి కీలక శాఖలో అప్పగిస్తే అందులో పురోగతి ఏముంటుంది? ఇది చంద్రబాబు చేసిన తప్పు కాదా? మరి దీన్ని ఎందుకు రాధాకృష్ణ దాస్తున్నట్టు? పైగా చంద్రబాబు లాగా సాచి వేత ఉండదని.. ఏ విషయమైనా సరే మొహమాటం లేకుండా చెబుతారని లోకేష్ బ్రిగేడియర్ బ్యాడ్జ్ ఇచ్చాడు ఆర్కే. అలా మెచ్యూరిటీ లేకపోవడం చంద్రబాబు హయాంలో అటు ఐటీ, ఇటు పురపాలకంలో ఏపీ వెనుకబాటుతనాన్ని ప్రదర్శించింది.. అంటే ఆర్కేతన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు బలవంతంగా ఏపీ మీద లోకేష్ ను రుద్దాడు అని చెబుతున్నాడా?!
అంతేకాదు టిడిపి డీఎన్ఏ లోనే పిరికితనం ఉందని రాధాకృష్ణ తేల్చేశాడు. అంటే టిడిపి వేగంగా నిర్ణయాలు తీసుకోదనే కదా అర్థం. అలాంటప్పుడు ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి ఉపయోగం ఉంటుంది? అనుభవం అని చెబుతున్న రాధాకృష్ణ.. నిర్ణయాలు తీసుకునే శక్తి లేనప్పుడు టిడిపిని ఎందుకు వెనకేసుకొస్తున్నట్టు.. చంద్రబాబుకు ఎందుకు వంత పాడుతున్నట్టు? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కోపంతోనే చంద్రబాబు కు వత్తాసు పలుకుతున్నాడా? అలాంటప్పుడు చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందుతుంది అని ఎలా చెబుతున్నాడు? అంతేకాదు నిండా 2 శాతం కూడా ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీ తో అంట కాగాలిసిన అవసరం టిడిపికి ఏముందని ప్రశ్నిస్తున్నాడు. ఇదే చంద్రబాబు 2014లో పొత్తు కోసం బిజెపి వద్దకు వెళ్లలేదా? తర్వాత మోడీని విమర్శించలేదా? పదవి పోయిన తర్వాత మళ్లీ మోడీ దగ్గరికి వెళ్లలేదా? పొత్తు కోసం సీఎం రమేష్ తో బేరసారాలు నడపలేదా? ఇవన్నీ రాధాకృష్ణకు తెలియవా? మరి బిజెపి కి రెండు శాతం కూడా ఓటు బ్యాంకు లేదని తెలిసినప్పుడు ఎందుకు పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు? తెర ముందు ఇన్ని నిజాలు కనిపిస్తున్నప్పుడు దాన్ని దాచి ఏదో డాంభికం ప్రదర్శిస్తే ఎలా?. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఇది ఎప్పుడు రాధాకృష్ణ అర్థమవుతుందో??
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rk kotha paluku cowardice is in tdps dna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com