Pushpa 2 Collection: పుష్ప 2 వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రూ. 1000 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం ఇప్పటికి రూ. 1500 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. హిందీలో పుష్ప 2కి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. మూడో వారం కూడా వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ముంబై సర్క్యూట్ లో పుష్ప 2 కలెక్షన్స్ రూ. 200 కోట్లకు చేరాయి. ఇక పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 618 కోట్లకు పైగా వసూలు చేసింది. బాహుబలి 2 హిందీ వసూళ్లను 11 రోజుల్లోనే పుష్ప 2 అధిగమించింది. బాహుబలి 2 హిందీ లైఫ్ టైం రూ. 511 కోట్ల వసూళ్లు సాధించింది.
మొత్తంగా బాహుబలి 2 టోటల్ కలెక్షన్స్ రికార్డు పై కూడా పుష్ప 2 మూవీ కన్నేసింది. 2017లో విడుదలైన బాహుబలి 2 వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే మరో రూ. 300 కోట్లు వసూలు చేస్తే.. బాహుబలి 2 చిత్రాన్ని పుష్ప 2 అధిగమిస్తుంది. అందుకు అవకాశం లేకపోలేదు. క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. డిసెంబర్ 25 పండుగ దినం కాగా.. న్యూ ఇయర్ వరకు జనాలు హాలిడే మూడ్ లోనే ఉంటారు. ఈ సెలవు దినాలను పుష్ప 2 వినియోగించుకుంటే మూడు వందల కోట్ల వసూళ్లను రాబట్టడం కష్టం ఏమీ కాదు.
ఈ వారం బచ్చల మల్లి, యూఐ, ముఫాసా చిత్రాలు విడుదలయ్యాయి. ముఫాసా హాలీవుడ్ డబ్బింగ్ మూవీ. కేవలం ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే వాటిని ఇష్టపడతారు. ఉపేంద్ర యూఐ నుండి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ పాజిటివ్ టాక్ వస్తేనే ఉపేంద్ర నటించిన యూఐ చిత్రాన్ని ఆదరిస్తారు. లేదంటే కనీస వసూళ్లు కూడా కష్టమే. ఇక మూడో చిత్రం అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.
అటు హిందీలో కూడా పుష్ప 2 చిత్రానికి పోటీ లేదు. డిసెంబర్ 25న వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన బేబీ జాన్ విడుదలవుతుంది. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్లు లేవు. కాబట్టి ఈ వీకెండ్ హిందీ బాక్సాఫీస్ ని పుష్ప 2 సోలోగా దున్నేయనుంది. హిందీ వెర్షన్ రూ. 1000 కోట్ల మార్క్ చేరుకున్నా ఆశ్చర్యం లేదు. అల్లు అర్జున్-సుకుమార్ ల పుష్ప 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. భారీ విజయం సాధిస్తుందని అందరూ అంచనా వేస్తారు. ఈ స్థాయి వసూళ్లు సాధిస్తుందని మాత్రమే ఊహించలేదు. అల్లు అర్జున్ ఇకపై సినిమాకు రూ. 200-300 కోట్లు తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
Web Title: Pushpa 2 movie box office collection day 15
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com