ఎస్బీఐ సూపర్ స్కీమ్.. నెలకు రూ.1500 కడితే రూ.లక్ష మీ సొంతం..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసి ఎక్కువ మొత్తం లాభాలను పొందాలను పొందాలని అనుకునే వాళ్లకు ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు, పోస్టాఫీస్ లలో కూడా సులభంగా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు. Also Read: నెలకు రూ.6వేలు చెల్లిస్తే కొత్తకారు మీ […]

Written By: Kusuma Aggunna, Updated On : March 3, 2021 5:57 pm
Follow us on

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసి ఎక్కువ మొత్తం లాభాలను పొందాలను పొందాలని అనుకునే వాళ్లకు ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు, పోస్టాఫీస్ లలో కూడా సులభంగా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో చేరవచ్చు.

Also Read: నెలకు రూ.6వేలు చెల్లిస్తే కొత్తకారు మీ సొంతం.. ఎలా అంటే..?

తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ లో అధిక రాబడిని పొందవచ్చు. ఈ స్కీమ్ లో తొలి ఏడాది నెలకు 8,100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరం తర్వాత ఏకంగా రూ.1,00,293 పొందవచ్చు. 8,100 రూపాయలు ఎక్కువ మొత్తం అని భావించే వాళ్లు రెండేళ్ల ప్లాన్ ను ఎంచుకుని నెలకు 4,000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే రూ.1,01,993 పొందవచ్చు. మూడు సంవత్సరాల ఆప్షన్ ను ఎంచుకున్న వాళ్లు నెలకు రూ.2,600 చొప్పున జమ చేయాల్సి ఉంటుంది.

Also Read: ఆన్ లైన్ లో డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. ఉన్న ఆప్షన్లివే..?

36 నెలల పాటు నెలకు 2,600 రూపాయల చొప్పున డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాల తరువాత రూ.1,02,816 పొందవచ్చు. నెలకు 1,500 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే 5 సంవత్సరాల ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. 60 నెలల పాటు 1,500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే లక్ష రూపాయలు సొంతమవుతాయి. ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 5.5 శాతం వడ్డీ అందిస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఈ స్కీమ్ లో సీనియర్ సిటిజన్స్ కు 6 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.