Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ కోసం కారణం దొరికింది

మూడు నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

Written By: NARESH, Updated On : October 26, 2023 6:49 pm
Follow us on

Chandrababu Bail : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు జగన్ సర్కార్ పెట్టిన టఫ్ కేసుల నుంచి ఎలా బయటపడాలన్నది అంతుచిక్కడం లేదు. ఏసీబీ కోర్టు నుంచి మొదలుపెడితే సుప్రీంకోర్టు వరకూ బాబు గారి పప్పులు ఉడకడం లేదు. 45 ఏళ్లుగా కోర్టులకు చిక్కకుండా వ్యవస్థలను మెయింటేన్ చేసిన బాబు గారు జైలు పాలై 45 రోజులు దాటింది. బాబు తరపు న్యాయవాదులు కోర్టుల్లో పోరాడుతున్నా ఫలితం దక్కడం లేదు. ఎన్ని కారణాలు చెప్పినా బెయిల్ దక్కడం లేదు. దీంతో మరో భారీ స్కెచ్ గీశాడు బాబు గారు. ఆయనకు ఆపరేషన్ అంటూ న్యాయవాదులు తాజాగా ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు అనారోగ్యంగా ఉన్న నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని వారు కోర్టు అధికారులను కోరారు. నిజానికి బాబుకు ఎలాంటి అనారోగ్యం లేదు. జైల్లో ఇంకా బరువు పెరిగాడు కూడా.. బెయిల్ రాకపోవడంతో ఈ కొత్త కారణం వెతికారు.

మూడు నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్‌ చేయాల్సి ఉందని న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఏపీ-సీఐడీ అధికారులు సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో భాగంగా నెల రోజులకు పైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నందున ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నాయుడు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబు కేసులో 17ఏని పరిగణనలోకి తీసుకోలేమని ఏపీ-సీఐడీ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల తీర్పులను విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అక్టోబర్ 28న తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై వేసిన పిటిషన్‌ను అక్టోబర్ 29న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉంది.

ఏ కేసులోనూ బాబుగారికి ఊరట , బెయిల్ దక్కే అవకాశాలు లేకపోవడం.. వరుస కేసులను జగన్ సర్కార్ వెలికి తీసి మరీ పెడుతుండడంతోనే ఇక చంద్రబాబు కంటి ఆపరేషన్ ను సాకుగా చూపి బెయిల్ పొందాలని కొత్త స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది.