కిడ్నీ అమ్ముతా కొంటారా.. ఫేస్ బుక్ లో ఆర్టీసీ ఉద్యోగి పోస్ట్..?

సాధారణంగా ఫేస్ బుక్ లో ఇళ్లు, స్థలాలు అమ్ముతామని కొంతమంది పోస్టులు పెడుతూ ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తన కిడ్నీనే అమ్ముతానని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల వేతనం తగ్గడం, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కరోనా ప్రజల స్థితిగతులను పూర్తిగా […]

Written By: Navya, Updated On : February 13, 2021 12:21 pm
Follow us on

సాధారణంగా ఫేస్ బుక్ లో ఇళ్లు, స్థలాలు అమ్ముతామని కొంతమంది పోస్టులు పెడుతూ ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తన కిడ్నీనే అమ్ముతానని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల వేతనం తగ్గడం, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కరోనా ప్రజల స్థితిగతులను పూర్తిగా మార్చేసింది.

Also Read: రూ.లక్షకు నాలుగు లక్షలు పొందే ఛాన్స్.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే..?

ముఖ్యంగా చిరుద్యోగులు, పేద, మధ్యతరగతి వర్గాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. అలా కరోనా వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైన ఒక ఉద్యోగి ” కిడ్నీలు అమ్ముతా..? ఎవరైనా కొంటారా..?” అని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టును చూసిన అతని స్నేహితులు, బంధువులు ప్రతి ఒక్కరికీ కష్టాలు ఉంటాయని.. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. కిడ్నీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవద్దని మరి కొందరు సలహాలు ఇస్తున్నారు.

Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. పూర్తిస్థాయిలో రైళ్లు ఎప్పటినుంచంటే..?

పూర్తి వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ హనుమంతు (38) కర్ణాటక ఆర్టీసీలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల సంస్థ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడంతో పాటు కుటుంబ పోషణ భారం కావడంతో హనుమంతును ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. జీతం తగ్గడం వల్ల రోజూవారీ ఖర్చులను భరించలేక కిడ్నీ అమ్మాలని నిర్ణయం తీసుకున్నానని ఆసక్తి ఉన్నవాళ్లు ఫోన్ చేయాలని హనుమంతు ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

అయితే హనుమంతు చేసిన పోస్ట్ గురించి ఆర్టీసీ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. హనుమంతు ఉద్యోగానికి సరిగ్గా రావడం లేదని అందువల్లే అతని వేతనంలో కోత విధించామని తెలిపారు. గతంలో అతనిని చాలాసార్లు ఈ విషయంలో హెచ్చరించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.