https://oktelugu.com/

‘ఉప్పెన‌’ జోరు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..?

ఆలస్యమైన ప్ర‌తిసారీ అమృతం విషం కాన‌క్క‌ర్లేదు.. ఒక్కోసారి డ‌బుల్ డోస్ తో మ‌రింత టేస్టీగా కూడా ఉండొచ్చు! ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’ విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడెప్పుడో లాక్ డౌన్ కు ముందే పూర్త‌యిన ఈ సినిమా.. రిలీజ్ కోసం లాక్ డౌన్ మొత్తం వెయిట్ చేయాల్సి వచ్చింది. Also Read: నేను జీవితంలో పెళ్లే చేసుకోను.. వాడు వ‌స్తే మాత్రం ఆలోచిస్తా : సాయి ప‌ల్ల‌వి ఈ క్రమంలో ఓటీటీల నుంచి ఆఫర్లు […]

Written By:
  • Rocky
  • , Updated On : February 13, 2021 / 12:17 PM IST
    Follow us on


    ఆలస్యమైన ప్ర‌తిసారీ అమృతం విషం కాన‌క్క‌ర్లేదు.. ఒక్కోసారి డ‌బుల్ డోస్ తో మ‌రింత టేస్టీగా కూడా ఉండొచ్చు! ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’ విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడెప్పుడో లాక్ డౌన్ కు ముందే పూర్త‌యిన ఈ సినిమా.. రిలీజ్ కోసం లాక్ డౌన్ మొత్తం వెయిట్ చేయాల్సి వచ్చింది.

    Also Read: నేను జీవితంలో పెళ్లే చేసుకోను.. వాడు వ‌స్తే మాత్రం ఆలోచిస్తా : సాయి ప‌ల్ల‌వి

    ఈ క్రమంలో ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా.. హీరో ముఖం చూసి ఆగిపోయారు మేకర్స్. మొదటి సినిమా.. అందులోనూ మెగా వారసుడు.. ఇన్ని కారణాలతో ఏదైతే అయ్యిందిలే అని వెయిట్ చేశారు. చివరకు.. ఆలస్యమే ఆ సినిమాకు వరమైంది. ఈ గ్యాప్ లో సినిమా గురించి జనాల్లో బాగా చర్చకు స్కోప్ ఏర్పడింది. ప్రమోషన్ కోసం కూడా కావాల్సినంత టైం దొరికింది.

    పాటలు జనాల్లో మారుమోగాయి.. సోషల్ మీడియాతోపాటు ప్రధాన స్రవంతిలోనూ మంచి డిస్కషన్ జరిగింది. ఇన్ని ప్లస్ పాయింట్లతో 12వ తేదీన సోలో గా థియేటర్లోకి ఎంటరైంది ‘ఉప్పెన’. దీంతో.. తొలిరోజు మంచి ఓపెనింగ్ దక్కించుకుందీ చిత్ర. నిజానికి.. ఒక డెబ్యూ హీరో, కొత్త డైరెక్టర్ సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్ రావడం అన్నది గొప్ప విష‌య‌మే.

    ఇందులోనూ గొప్ప విష‌యం ఏమంటే.. ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఫ్యామిలీలు కూడా క‌నిపించ‌డం విశేషం. సంక్రాంతికి విడుద‌లైన సినిమాల‌కు యూత్ మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపించారు. అప్ప‌టికి క‌రోనా భ‌యం పోలేదు కాబ‌ట్టి.. మొండిగా యువ‌కులు మాత్ర‌మే టిక్కెట్లు తెంపారు. ఇప్పుడు వ్యాక్సిన్ కూడా రావ‌డం.. సినిమా థియేట‌ర్ ముఖం చూడ‌క ఏడాది కావ‌స్తుండ‌డంతో ఫ్యామిలీతో థియేట‌ర్లో అడుగు పెడుతున్నారు ప్రేక్ష‌కులు.

    Also Read: సమంత డ్రెస్ ధరెంతో తెలిస్తే.. అవాక్కవాల్సిందే..

    ఆ విధంగా తొలి రోజున మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది ఉప్పెన. ఇక ఈ రెండు రోజులూ వీకెండ్‌. పైగా థియేట‌ర్ల‌లో పెద్ద‌గా సినిమాలు ఏమీ లేవు. కాబ‌ట్టి క‌లెక్ష‌న్స్ నిల‌క‌డ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఎటొచ్చీ.. సోమ‌వారం క‌లెక్ష‌న్స్ ఎలా ఉంటాయ‌న్న‌దానిపైనే.. ఈ సినిమా ర‌న్ డిసైడ్ అవుతుంది. ఆ రోజు ర‌ష్ ను బ‌ట్టి సినిమా కండీష‌న్ తేలిపోతుంద‌ని భావిస్తున్నారు ట్రేడ్ అన‌లిస్ట్‌లు.

    తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    నైజాం = 3.08 కోట్లు
    వైజాగ్ = 1.43
    సీడెడ్ = 1.35
    ఈస్ట్ = 0.98
    వెస్ట్ = 0.81
    కృష్ణ = 0.62
    గుంటూరు = 0.65
    నెల్లూరు = 0.35

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్