https://oktelugu.com/

రూ.లక్షకు నాలుగు లక్షలు పొందే ఛాన్స్.. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే..?

దేశంలో చాలామంది తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం లాభాలను పొందే స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మాత్రమే ఇలా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అలా లాభాలను ఇచ్చే స్కీమ్ లలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. Also Read: తక్కువ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 13, 2021 / 11:30 AM IST
    Follow us on

    దేశంలో చాలామంది తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం లాభాలను పొందే స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొన్ని స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మాత్రమే ఇలా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అలా లాభాలను ఇచ్చే స్కీమ్ లలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒకటి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు.

    Also Read: తక్కువ పెట్టుబడితో డబ్బులు సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

    ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో పది సంవత్సరాల సగటు రాబడి 13 శాతం కంటే ఎక్కువ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ కొన్ని ఫండ్స్ 15 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించడం గమనార్హం. 2011 సంవత్సరంలో ఈఎల్ఎస్ఎస్ కొన్ని ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు నాలుగు లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. పూర్తిస్థాయిలో రైళ్లు ఎప్పటినుంచంటే..?

    యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ గత పది సంవత్సరాల రాబడి ఏకంగా 18.64 శాతంగా ఉండటం గమనార్హం. మీరు పది సంవత్సరాల క్రితం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏకంగా 5 లక్షల 50 వేల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. డీఎస్‌పీ ట్యాక్స్ సేవర్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా ట్యాక్స్ ప్లాన్ కూడా స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు అదిరిపోయే రాబడిని పొందే అవకాశాన్ని కల్పించడం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    బీఎన్‌పీ పారిబాస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ రాబడి 15.28 శాతంగా ఉంది. ఐడీఎఫ్‌సీ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 15.05 శాతం రాబడిని అందించడం గమనార్హం.