Visakhapatnam: ఇదేందయ్యా.. సాగరనగరంలో రేవ్ పార్టీలు..

విశాఖకు ప్రశాంత నగరంగా పేరు ఉంది. పర్యాటకంగా అందమైన నగరం. సువిశాల తీరం... ఎటు చూసినా పచ్చదనం నగరం సొంతం. నిత్యం పర్యాటకులు వస్తుంటారు.

Written By: Dharma, Updated On : February 24, 2024 9:29 am
Follow us on

Visakhapatnam: విశాఖలో రేవ్ పార్టీ సంస్కృతి పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యువత మత్తు పదార్థాలతో జోగుతున్నారు. విశాఖ నగరం తో పాటు పరిసర మండలాల్లో పెద్ద ఎత్తున రిసార్ట్స్ వెలుస్తున్నాయి. అధికార పార్టీ నాయకులే ఈ రిసార్ట్స్ నిర్వాహకులని తెలుస్తోంది. అచ్యుతాపురం మండలం కొండకర్ల లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరిగింది. యువతీ యువకుల ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఈ రిసార్ట్స్ ల పై రకరకాల ఆరోపణలు వస్తున్నాయి.

విశాఖకు ప్రశాంత నగరంగా పేరు ఉంది. పర్యాటకంగా అందమైన నగరం. సువిశాల తీరం… ఎటు చూసినా పచ్చదనం నగరం సొంతం. నిత్యం పర్యాటకులు వస్తుంటారు. సేదతీరుతుంటారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చాలామంది రిసార్ట్స్ లను ఏర్పాటు చేస్తుంటారు. భీమిలి, గాజువాక, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో వందల సంఖ్యలో రిసార్ట్స్ లు ఉన్నాయి. అయితే వాటికి అనుమతులు ఉన్నాయో లేవో తెలియదు కానీ నిత్యం యువతీ యువకులు రిసార్ట్స్ లకు వెళుతుంటారు. బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

మూడు రోజుల కిందట విశాఖ నగరానికి చెందిన 15 మంది యువకులు, నలుగురు యువతులు కొండకర్ల రిసార్ట్స్ కు వచ్చారు. తెల్లవారుజాము వరకు అక్కడ పార్టీ కొనసాగింది. అయితే మద్యం మత్తు ఎక్కువ కావడంతో వెంట తీసుకువచ్చిన యువతులను దుస్తులు లేకుండా డాన్స్ చేయమని యువకులు ఒత్తిడి చేశారు. దీంతో ఆ యువతులు రక్షించాలంటూ 100 నెంబర్ కు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి రక్షించాల్సి వచ్చింది. అయితే ఎన్నడూ లేని విధంగా విశాఖ నగరంలో రేవ్ పార్టీ సంస్కృతి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పార్టీల నడుమ అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని.. సాధారణ పర్యటకులకు సైతం ఇబ్బందులు వస్తున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విశాఖ నగర పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.