https://oktelugu.com/

Banks: అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో తెలియాలంటే.. ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి

డబ్బులు పడ్డాయో లేదో తెలియక ఇబ్బంది పడుతుంటారు. డబ్బులు పడ్డాయో లేదో అని కూడా తెగ టెన్షన్ పడుతుంటారు. అయితే ఇదంతా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో వెంటనే తెలుసుకోవచ్చు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 28, 2024 / 04:53 PM IST

    Without going to a bank, how can I know who credited money to my account

    Follow us on

    Banks: ఎవరైనా అకౌంట్లో డబ్బులు వేస్తే బ్యాంకు వెళ్లి చెక్ చేసుకుంటాం. లేకపోతే యూపీఐలో చెక్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు చెక్ చేసుకోవాలంటే సెర్వర్ బిజీగా ఉండటం వల్ల యూపీఐ పనిచేయదు. పోనీ బ్యాంకు లేదా ఏటీఎంకి వెళ్లి చెక్ చేసుకుందామంటే కుదరదు. కొన్నిసార్లు సిగ్నల్ సమస్యల వల్ల మొబైల్‌కి మెసేజ్ కూడా రాదు. దీనివల్ల డబ్బులు పడ్డాయో లేదో తెలియక ఇబ్బంది పడుతుంటారు. డబ్బులు పడ్డాయో లేదో అని కూడా తెగ టెన్షన్ పడుతుంటారు. అయితే ఇదంతా ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో వెంటనే తెలుసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లకుండా క్షణాల్లో అకౌంట్లో డబ్బులను చెక్ చేయవచ్చు. బయటకు వెళ్లే సమయం లేక ఇంట్లో ఉండి వెంటనే అకౌంట్‌లో ఉన్న డబ్బులు తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. ఒకవేళ బ్యాంకు‌ దగ్గరు వెళ్లిన పెద్ద క్యూలైన్లు ఉండటంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్యలు లేకుండా ఇంట్లో ఉండే డబ్బులు చెక్ చేసుకోవడం ఎలాగో తెలుసుకోవాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

    మీరు వాడుతున్న బ్యాంకు అకౌంట్ నంబర్‌ని సేవ్ చేసుకుని వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయాలి. ఇలా మెసేజ్ చేస్తే కేవలం అకౌంట్లో ఉన్న డబ్బుల వివరాలు మాత్రమే కాకుండా మిని స్టేట్‌మెంట్, క్రెడిట్ కార్డు వివరాలు, లోన్స్ తీసుకోవచ్చు. బ్యాంకు వరకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఆఖరికి లోన్‌ కూడా ఇలా మెసేజ్ పెట్టి తీసుకోవచ్చు. అయితే ఒక్కో బ్యాంక్‌కి ఒక్కో నంబర్ ఉంటుంది. ఆ నంబర్‌ను సేవ్ చేసుకుని.. వాట్సాప్‌లో మెసేజ్ పెడితే వెంటనే వివరాలు వస్తాయి. అయితే మెసేజ్ పెట్టిన తర్వాత లాగిన్ కావాలి. అప్పుడే పూర్తి వివరాలు వస్తాయి. బ్యాంకు, ఏటీఎం వరకు వెళ్లకుండా ఇలా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కాకపోతే మీరు ఇలా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినప్పుడు కాస్త ప్రైవసీ పాటించాలి. లేకపోతే మీ పూర్తి వివరాలు ఇతరులు తెలుసుకునే అవకాశం ఉంది. ఇలా వారికి పూర్తి వివరాలు తెలిసినప్పుడు మీ డబ్బులు పోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజుల్లో ఎవరిని కూడా సరిగ్గా నమ్మలేం. మీ చుట్టూ ఉన్నవారే మోసం చేయవచ్చు. కాబట్టి వాట్సాప్‌కి కూడా ప్రైవసీ పాటించండి. లేకపోతే మీ డబ్బులు పోయే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్త వహించండి.

    బ్యాంకు ఫోన్ నంబర్ల వివరాలు
    ఎస్‌బీఐ బ్యాంకు 9022690226
    కెనరా బ్యాంకు 9076030001
    ఇండియన్ బ్యాంకు 8754424242
    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 7070022222
    యాక్సస్ బ్యాంకు 7036165000
    ఐడీఎఫ్‌సీ బ్యాంకు 9555555555
    కోటక మహేంద్ర బ్యాంకు 2266006022
    యూనియన్ బ్యాంకు 9666606022
    ఎస్ బ్యాంకు 8291201200