Thrissur ATM Robbery: అది కేరళ రాష్ట్రం. త్రిస్సూర్ పట్టణం. శుక్రవారం తెల్లవారుజామున ఆ పట్టణంలోని మూడు ఏటీఎంలలో దొంగలు పడ్డారు. నగదు దోచుకుని వెళ్ళిపోతున్నారు. వారి గురించి సమాచారం అందడంతో కేరళ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దొంగలకు విస్తృతమైన నేరచరిత్ర ఉండడంతో తమిళనాడు, కర్ణాటక పోలీసుల సహాయం కోరారు. ఆ దోపిడీ దొంగలు హర్యానా ప్రాంతానికి చెందినవారు. వాళ్లంతా ఏటీఎంలో దొంగతనాలకు పాల్పడుతుంటారు. త్రిస్సూర్ పట్టణంలోని ఏటీఎంలోనూ అలానే దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగిలించిన సొమ్ముతోపాటు ఒక లగ్జరీ కారును ఒక్క కంటైనర్ లారీలో భద్రపరిచి.. అదే కంటైనర్ లారీలో పారిపోతున్నారు. అయితే ఆ దొంగలను కేరళ రాష్ట్రంలోని నామక్కల్ పోలీసులు వెంటాడారు.. అచ్చం ధూమ్ సినిమా తరహాలోనే చేజింగ్ చేశారు. వారిని పట్టుకునే క్రమంలో పోలీసులకు గాయాలయ్యాయి. ఆ దోపిడి దొంగలు కాల్పులు జరపడంతో.. ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు.. అయితే పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరపగా.. ఒక దొంగ అక్కడికక్కడే చనిపోయాడు. మరొక వ్యక్తి ఆసుపత్రి పాలయ్యాడు. ఆ ముఠాలో మిగతా ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు.
దొంగతనం చేశారిలా..
హర్యానా దొంగల ముఠా త్రిస్సూర్ లో మోడీ ఏటీఎంలో చోరీకి పాల్పడింది.. తెల్లవారుజామున రెండు గంటల 30 నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు ఏకకాలంలో ఈ చోరీలు జరిగాయి. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఆ దొంగల ముఠా ఏటీఎం లను సమూలంగా బద్దలు కొట్టింది. అందులో నగదును తీసుకెళ్లింది. అయితే ఒక ఏటీఎంలో అలారం అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే ఆ దొంగలు లగ్జరీకారులో వచ్చి చోరీలకు పాల్పడ్డారు. అలారం మోగడంతో పోలీసులు ఆ ఏటీఎం వద్దకు రాగానే.. దొంగలు లగ్జరీకారులు పారిపోవడాన్ని గమనించారు.. వారిని పోలీసులు అనుసరిస్తుండగానే.. ఆ కారు హైవే మీదకి ఎక్కి మాయమైపోయింది. అదే సమయంలో జాతీయ రహదారి మీదుగా కంటైనర్ రావడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ రాష్ట్ర సరిహద్దుల్లోని తనకి కేంద్రాలను అప్రమత్తం చేశారు.. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు.. ఆ దొంగల ముఠా మూడు ఏటీఎంలో ఏకంగా 65 లక్షల నగదును తస్కరించింది. ఈ విషయాన్ని త్రిసూర్ పోలీస్ కమిషనర్ ఇలంగోవన్ అత్యంత సవాల్ గా తీసుకున్నారు.. తమిళనాడులోని కోయంబత్తూరు.. కర్ణాటక వైపు వెళ్లే మార్గాలను తీవ్రంగా పరిశీలించారు.. ఇతర రాష్ట్రాల అధికారులకు సమాచారం అందించారు. పోలీస్ బృందాలు కోయంబత్తూరు, నామక్కల్, ఈ రోడ్, సేలం, క్రిష్ణగిరి మార్గాలలో మాట వేసింది. అయితే త్రిస్సూర్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ కారు జడ కనిపించలేదు.. ఇదే సమయంలో పోలీసులు కంటైనర్ లారీల మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే ఆ దొంగల ముఠా జాతీయ రహదారి మీదుగా కాకుండా సర్వీస్ రోడ్లపై ప్రయాణించి నామక్కల్ ప్రాంతంలోకి ప్రవేశించింది. కుమారపాలెం సమీపంలోని వేప్పడై ప్రాంతంలో పోలీసులను చూసిన ఆ దొంగల ముఠా ప్రయాణిస్తున్న కంటైనర్ లారీ ఆగకుండా వెళ్ళింది. పక్కగా వెళ్తున్న వాహనాలను ఢీ కొట్టింది. దీంతో పోలీసులకు అనుమానం పెరిగి.. ఆ వాహనాన్ని చేజ్ చేశారు. నామకల్ ఎస్పీ రాజేష్ కన్నన్ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు ఆ కంటైనర్ లారీని అనుసరించాయి. నామక్కల్ – సేలం దారిపైకి ఇతర వాహనాలు రాకుండా కాసేపు పోలీసులు నిలుపుదల చేశారు. ఆ తర్వాత సేలం జిల్లా సరిహద్దుల్లోకి ఆ కంటైనర్ లారీ ప్రవేశించే సమయంలో పోలీసులు చుట్టుముట్టారు.
ఇన్ ఫార్మర్ వ్యవస్థతో..
అయితే ఆ దొంగలు తమ ఇన్ ఫార్మర్ వ్యవస్థతో ఇక్కడికి వచ్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ముందుగా వారు ఒక పథకం రూపొందించారు. దొంగతనం చేసిన సొమ్ముతో కారులో పరారు కావాలని నిర్ణయించుకున్నారు. జాతీయ రహదారి లేదా తమ గూగుల్ మ్యాప్ ద్వారా ముందుగానే నిర్ణయించుకున్న ప్రాంతంలోని కంటైనర్ లోకి రావాలని భావించారు. త్రిసూర్ లో ఏటీఎంలలో చోరీ చేసి.. అదే ప్లాన్ ను అమల్లో పెట్టారు. అయితే కుమారపాలెం వద్ద పోలీసులను చూసిన కంటైనర్ డ్రైవర్ దూకుడుగా డ్రైవింగ్ చేయడం.. పోలీసులు సమీపిస్తున్నప్పుడు వేగంగా వెళ్లడంతో.. ఆ ముఠా ఆట కట్టడైంది. అయితే ఆ దొంగల ముఠా ప్రయాణిస్తున్న లారీ కంటైనర్ ఎస్ కే లాజిస్టిక్స్ పేరు మీద నమోదయి ఉంది. అది త్రిసూర్ పట్టణానికి సరుకుల లోటుతో వచ్చింది.. హ లారీ యజమాని పేరు సలీం ఖాన్. అతడికి 18 కంటైనర్లు ఉన్నాయి. అతడు పలు సంస్థలకు వాటిని అద్దెకిచ్చాడు. ఆ కంటైనర్ ను అద్దెకు తీసుకున్నవారు ఇలాంటి పనులు చేయడంతో అతడు ఆందోళన చెందుతున్నాడు.. కాగా ఆ కంటైనర్ లారీలో భారీగా నగదు ఉండడంతో పోలీసులు సీజ్ చేశారు.
കാര് ഒളിപ്പിച്ചത് കണ്ടെയ്നറിനുള്ളില്, ഇടിച്ചു തകര്ത്ത് യാത്ര; പൊലീസ് തടഞ്ഞപ്പോള് നടുറോഡില് സിനിമാ സ്റ്റൈല് ഏറ്റുമുട്ടല് https://t.co/6gyiUHi7gv
— Samakalika Malayalam (@samakalikam) September 27, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More