https://oktelugu.com/

రేషన్ డీలర్లు మోసం చేస్తున్నారా.. ఎలా ఫిర్యాదు చేయాలంటే..?

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాళ్లకు రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరకే సరుకులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రేషన్ డీలర్ల మోసాల వల్ల చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. అర్హత ఉన్నా రేషన్ సరుకులు అందకపోవడం లేదా తూనికలలో మోసాలు జరగడం లేదా తీసుకోవాల్సిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం తీసుకోవడం వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారు. అయితే ఈ సమస్యలను ఫిర్యాదు చేయడం ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 4, 2021 10:50 am
    Follow us on

    కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాళ్లకు రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరకే సరుకులను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రేషన్ డీలర్ల మోసాల వల్ల చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. అర్హత ఉన్నా రేషన్ సరుకులు అందకపోవడం లేదా తూనికలలో మోసాలు జరగడం లేదా తీసుకోవాల్సిన మొత్తం కంటే ఎక్కువ మొత్తం తీసుకోవడం వల్ల పేద ప్రజలు నష్టపోతున్నారు.

    అయితే ఈ సమస్యలను ఫిర్యాదు చేయడం ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ ప్రతి రాష్ట్రానికి రేషన్ సమస్యల గురించి ఫిర్యాదు చేయడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ ను కేటాయించింది. టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా మనం ఎదుర్కొంటున్న సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుంది. https://nfsa.gov.in వెబ్ సైట్ ద్వారా టోల్ ఫ్రీ నంబర్లకు సంబంధించి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

    ఫిర్యాదు చేయాలని అనుకునేవాళ్లు నేరుగా వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతారు. ఏపీలో రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు 1800 – 425 – 2977 నంబర్ కు ఫోన్ చేసి రేషన్ సంబంధిత సమస్యల గురించి ఫిర్యాదు చేయవచ్చు. తెలంగాణలో రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు 1800 – 4250 – 0333 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

    రేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ రేషన్ మోసాలను అరికట్టేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.