https://oktelugu.com/

వంటలకు ఏ నూనె వాడితే మంచిదో తెలుసా..?

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ను ఎక్కువగా వంటలకు వినియోగిస్తున్నారు. అయితే వంటలకు ఏ నూనె వాడితే మంచిదనే ప్రశ్న మనలో చాలామందిని వేధిస్తోంది. అయితే ఏ వంటనూనెను వాడినా కొన్ని లాభాలు ఉంటే కొన్ని నష్టాలు ఉన్నాయి. అందువల్ల మన అవసరాలకు అనుగుణంగా వంటనూనెను ఎంచుకోవాలి. Also Read: రేషన్ డీలర్లు మోసం చేస్తున్నారా.. ఎలా ఫిర్యాదు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 4, 2021 / 10:57 AM IST
    Follow us on

    ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల వంటనూనెలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ను ఎక్కువగా వంటలకు వినియోగిస్తున్నారు. అయితే వంటలకు ఏ నూనె వాడితే మంచిదనే ప్రశ్న మనలో చాలామందిని వేధిస్తోంది. అయితే ఏ వంటనూనెను వాడినా కొన్ని లాభాలు ఉంటే కొన్ని నష్టాలు ఉన్నాయి. అందువల్ల మన అవసరాలకు అనుగుణంగా వంటనూనెను ఎంచుకోవాలి.

    Also Read: రేషన్ డీలర్లు మోసం చేస్తున్నారా.. ఎలా ఫిర్యాదు చేయాలంటే..?

    సన్ ఫ్లవర్ ఆయిల్ లో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు తక్కువగా ఉన్నాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఉండే యాసిడ్లు రక్తంలో కొవ్వును తగ్గిస్తాయి. ఈ ఆయిల్ లో పాలీ అన్ శాచురేటెడ్, మోనో శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. నువ్వుల నూనెలో పాలీ అన్ శాచురేటెడ్, మోనో శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. నువ్వుల నూనె ఎన్నో వ్యాధుల బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది.

    Also Read: శయనిస్తున్న దర్శనం కల్పించే శివుడి ఆలయం ఎక్కడుందో తెలుసా..?

    ఈ నూనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇతర నూనెలలో పోలిస్తే వేరు శెనగ నూనె ఖరీదు ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ను, కంటిచూపును మెరుగుపరచడంలో వేరుశెనగ నూనె సహాయపడుతుంది. ఒమేగా 6 యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు, మోనో శాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఇ వేరుశనగ నూనెలో ఉంటాయి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఆలివ్ ఆయిల్ లో మోనో శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడంలో ఈ నూనె సహాయపడుతుంది. ఆలివ్ నూనెలో ఉండే లో డెన్సిటీ లైపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఆవనూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాలేయం చుట్టూ కొవ్వు ఏర్పడకుండా చేయడంలో ఆవనూనె సహాయపడుతుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మోనో శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండే ఆవనూనె కాలేయం చుట్టూ కొవ్వు ఏర్పడకుండా రక్షిస్తుంది.