ఏపీలో మరికొద్ది రోజుల్లో డీఎస్సీ నిర్వహించబోతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలపై విద్యాశాఖ లెక్క తేల్చింది. 16 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు వెల్లడించింది. వీటిలో 402 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం తెలిపింది. మరో 15,926 నియామకాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఈ మేరకు మొదట మినీ డీఎస్సీ, ఆ తర్వాత సాధారణ డీఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
Also Read: తమిళ గడ్డపై మజ్లిస్ మ్యాజిక్ : డీఎంకేతో పొత్తు కుదిరేనా..?
ఇందులోభాగంగా ముందుగా బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడనుంది. ఇందులో మిగిలిన వాటిని జనరల్‌కు మారుస్తారు. నియామక పరీక్షతోపాటే టెట్‌ను కూడా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఇప్పటికే తేదీలను నిర్ణయించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈసారి పాఠ్య ప్రణాళికనూ మారుస్తున్నారు. ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియానికి ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో అభ్యర్థుల్లోని ఇంగ్లిష్ స్కిల్స్ పరీక్షించనున్నారు.
ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉండడంతో సాధారణ డీఎస్సీ నిర్వహించేందుకు కూడా కసరత్తు జరుగుతోంది. ట్రాన్స్‌ఫర్ల అనంతరం అధికారులు ఖాళీల వివరాలను సేకరించారు. భర్తీకి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. ప్రభుత్వం నుంచి ఇంకా అయితే ఆమోదం రాలేదు. 16 వేలకు పైగా ఖాళీల్లో ఎన్నింటికి ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతుందో తెలియకుండా ఉంది. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమీక్షలోనూ పోస్టుల భర్తీ ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. రిక్రూట్ మెంట్ ప్రకటనకు, పరీక్షకు 45 రోజుల టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం పరీక్ష, ఫలితాలు, కౌన్సెలింగ్‌కు మరో నెల వరకు సమయం పడుతుందని అంచనా. ఆ తర్వాతే సాధారణ డీఎస్సీకి ప్రకటన ఉండొచ్చనేది తెలుస్తోంది.
Also Read: ముగిసిన శశికళ ప్రయాణం.. ఎందుకు తప్పుకుంది? బీజేపీ ఒత్తిడేనా?
ఒక పక్క కొత్త డీఎస్సీకి ప్రతిపాదనలు సిద్ధమవగా.. రెండేళ్ల క్రితం ప్రకటించిన డీఎస్సీ–2018లోని అన్ని పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. న్యాయ వివాదాలతో కొన్ని నియామకాలు నిలిచిపోయాయి. మొత్తం 7,902 ఖాళీలను ప్రకటన ఇవ్వగా.. 860 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో స్కూల్ అసిస్టెంట్లు తెలుగు, భాషా పండితులు కలిపి 374 వరకు ఉన్నాయి. మిగతావి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. న్యాయస్థానం తీర్పు అనంతరం వీటి నియామకాలకు చర్యలు తీసుకోనున్నారు. సాధారణ డీఎస్సీ కంటే ముందే వీటిని భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే నియామక ప్రకటన చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్