Rasi Phalalu Today : జీవితంలో చేసే పనలు కలిసి రావాలంటే గ్రహాల శక్తి కూడా తోడవ్వాలి. ఆస్ట్రాలజీ ప్రకారం జాతకం ఎలా ఉందో తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకుంటే అన్నీ కలిసి వస్తాయి. ప్రతి వ్యక్తి జన్మనక్షత్రం ప్రకారం తాను ఏ పని చేయొచ్చో? ఏ పని చేయకూడదో జ్యతిష్య శాస్త్రం వివరిస్తుంది. ప్రతిరోజూ గ్రహాల మార్పుకు అనుగుణంగా వ్యక్తుల జాతకం మారుతూ ఉంటుంది. అక్టోబర్ 2 సోమవారం ఎవరి రాశి ఏ విధంగా ఉందో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాల ఫలితాలు ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన అంశాల్లో సరైన నిర్ణయం తీసుకోలేకపోతారు. కాబట్టి ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈరోజు దత్తాత్రేయ స్వామిని పూజిస్తూ వజ్రకవచం పూజ చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది.
వృషభరాశి:
వృషభ రాశి వారు దూరపు ప్రయాణాలు చేస్తుంటారు. దూరపు బంధువులతో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈరోజు ఉమామహేశ్వురుడిని పూజిస్తూ శివార్చన చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
మిథున రాశి:
ఈ రాశివారు సోమవారం చంచలమైన మనస్తత్వంతో ఉంటారు. వివిధ రూపాల్లో వారు ఆందోళనతో కనిపిస్తారు. ఈ రాశివారు అనవసరమైన గోడవల్లోకి తలదూరకుండా ఉండాలి. ఈరోజు వీరికి లక్ష్మీ వేంకటేశ్వర స్వామి అనుకూల దైవ. తులసీ మాలతో స్వామి వారిని పూజించడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి:
మానసిక సంతోషాలుకలుగుతాయి. గతంలో వేర్వేరు కారణాలతో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. వీరు ఈరోజు సంతోషంగా ఉంటారు. వీరు ఈరోజు రాఘవేంద్రస్వామిని పూజిస్తూ గురుస్తోత్రంను పారాయణం చేయడం వల్ల మరింత మనశ్శాంతి ఉంటుంది.
సింహరాశి:
దూర దేశ సంబంధమైన ప్రయాణాలు చేయడం.. వాటికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి. అయితే దగ్గరి బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరికి సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తూ ఉండాలి.
కన్యారాశి:
స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. కష్టాలు తొలిగిపోతాయి. అప్పుల బాధ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తొలిగిపోతాయి. ఈరోజు వీరు అష్టలక్ష్మిని పూజిస్తూ అష్టలక్ష్మి స్తోత్రంను పారాయణం చేయాలి.
తులా రాశి:
గౌరవ మర్యాదలకు లోటు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చుల జోలికి పోకూడదు. వేర్వేరు విషయాల్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వీరు శ్రీమహావిష్ణువును పూజించడం అనుకూల వల్ల ఫలితాలు ఉంటాయి.
వృశ్చిక రాశి:
వీరు ప్రవర్తన వల్ల కొన్ని అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులు సలహాలు ఇస్తూ ఉండాలి. ఉద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజువీరు శ్రీ ఆంజనేయ స్వామిని పూజిస్తూ దండకమును చదవాలి.
ధనుస్సు రాశి:
రుణ ప్రయత్నాలు ఫలితాలు ఇస్తాయి. కటుుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో బాధపడుతారు. వేర్వేరు రూపాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు ఈరోజు రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ రామలక్ష్మణ స్తోత్రం చదువుతూ ఉండాలి.
మకర రాశి:
కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. గృహ సంబంధమైన మార్పులు ఉంటాయి. ఇతరులను విమర్శించకూండా ఉంటే మంచింది. వీరు మహా గణపతిని పూజిస్తూ గణపతి అష్టకమును చదవాలి.
కుంభ రాశి:
కుంభరాశి వారు స్థిర, చరాస్థిలు క్రయ, విక్రయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఇతరుల వల్ల గౌరవం పెరుగుతుంది. వీరు మహాకాళి అమ్మవారిని పూజిస్తూ కుంకుమ పూజ చేయాలి
తులారాశి:
కుటుంబ పరమైన సంతోషాలు కలుగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. వేర్వేరు ఒప్పందాలు చేసుకుంటారు. వీరు మహా సరస్వతి అమ్మవారిని పూజిస్తూ ఉండడం మరీ మంచిది.