https://oktelugu.com/

Rahul Gandhi: మోడీ కులం బీసీ గుర్తింపుపై నోరుపారేసుకుని అభాసుపాలైన రాహుల్ గాంధీ

మోడీ కులం బీసీ గుర్తింపుపై నోరుపారేసుకుని అభాసుపాలైన రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : February 9, 2024 / 04:02 PM IST

    ఒక రోడ్ సైడ్ మాట్లాడుకునే వాళ్లలా.. గాసిప్ లు చేసుకునే వాళ్లలా.. వివాదాలు రాజేసేవాళ్లలాగా.. రాహుల్ గాంధీ దిగజారిపోయారు. రాహుల్ మాటలు అంతలా దిగజారిపోయారు. ఒక పార్టీకి అనధికార అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న రాహుల్ గాంధీ.. మోడీపై స్టేట్ మెంట్ ఇచ్చేముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? అయినా ఏమీ చూసుకోకుండా రాహుల్ మాట్లాడుతూనే ఉన్నాడు.

    ఒకసారి చౌకీదార్ చోర్ హై అని.. రెండోసారి ‘మోడీ’లు అందరూ దొంగలేనని అన్నాడు. అసలు మోడీ ‘ఓబీసీ’ కాదు అని.. ఆయన జనరల్ కేటగిరిలోకి వస్తాడు.. మోడీ అధికారంలోకి వచ్చాక తన కులాన్ని ఓబీసీలోకి చేర్చుకున్నాడు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు చేయడం సంచలనమైంది.

    ఓబీసీలను జనతా పార్టీ హయాంలో మొరార్జీ దేశాయ్ గుర్తించారు. మండల్ కమిషన్ వేశారు. ఈ నివేదికను ఇందిరాగాంధీకి సమర్పిస్తే దాన్ని తొక్కిపట్టేసి నీరుగార్చింది. ఆవిడ తర్వాత రాజీవ్ గాంధీ కూడా బయటపట్టలేదు. 1990 ఆగస్టులో వీపీ సింగ్ ‘మండల్ కమిషన్’ బయటపెట్టేదాకా ఆ నివేదికలో ఏముందో తెలియదు..

    మోడీ కులం బీసీ గుర్తింపుపై నోరుపారేసుకుని అభాసుపాలైన రాహుల్ గాంధీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.