‘Zomato’ shares : ‘జొమాటో’ కొన్నవాళ్లకు లాభాలే లాభాలు..

3.75% లాభంతో ₹149.40 వద్ద ట్రేడ్ అయింది.. తర్వాత క్రమక్రమంగా పెరిగింది. దీంతో జొమాటో షేర్లను కొనుగోలు చేసిన మదుపరులు పండగ చేసుకుంటున్నారు.

Written By: NARESH, Updated On : February 9, 2024 4:14 pm
Follow us on

‘Zomato’ shares : ఫుడ్ డెలివరీ అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో చిన్న అంకుర సంస్థగా మొదలైన జొమాటో ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. వేలాదిమంది డెలివరీ బాయ్ లకు ఉపాధి కల్పిస్తూ దేశవ్యాప్తంగా ఆహారాన్ని సరఫరా చేస్తోంది. అలాంటి ఈ సంస్థ శుక్రవారం షేర్ మార్కెట్లో మెరిసింది. మదుపరులు షేర్లను కొనుగోలు చేసేందుకు పోటీ పడటంతో ఒక్కసారిగా దాని ధర నాలుగు శాతం పెరిగింది. 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ₹138 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలానికి ₹347 కోట్ల నష్టాన్ని జొమాటో ప్రకటించింది. కానీ ఈ ఏడాది మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన నికర లాభం ₹283 శాతానికి జొమాటో పెంచుకుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జొమాటో షేర్ ధరలు 121 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. డిసెంబర్ 2023 తో ముగిసిన త్రైమాసికంలో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో బలమైన వృద్ధిని జొమాటో నమోదు చేస్తూ వస్తోంది. దీనివల్ల మదుపరులు ఆ సంస్థ షేర్లు కొనుగోలు చేసేందుకు శుక్రవారం పోటీలు పడ్డారు. ప్రారంభ ట్రేడింగ్ లో ముఖ విలువపై నాలుగు శాతం ధర పెరిగి 52 వారాల గరిష్ట స్థాయికి జొమాటో షేర్ చేరుకుంది. బీఎస్ఈ లో జొమాటో షేర్లు 4.34% లాభపడి ₹150.25 కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికానికి జొమాటో ₹138 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో ₹347 కోట్ల నష్టాన్ని జొమాటో ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఫుడ్ డెలివరీ బిజినెస్ ద్వారా జొమాటో ఆదాయం 3,288 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది నమోదు చేసిన 1,948 కోట్ల ఆదాయంతో పోల్చితే 69% ఎక్కువ. సంస్థకు సంబంధించి ఫుడ్ డెలివరీ స్థూల ఆర్డర్ విలువ గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరానికి 25 శాతం పెరిగింది. అంతకుమించి అనే విధంగా అభివృద్ధిని కొనసాగించాలని ఆశిస్తున్న నేపథ్యంలో.. కంపెనీ మరింత వృద్ధి బాటలో కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం ఫలితాల ప్రకటన తర్వాత గురువారం జొమాటో షేర్లు 2.42% లాభంతో ముగిశాయి. జొమాటో అసాధారణమైన ఫుడ్ డెలివరీతో స్మార్ట్ లాభాలు ఆశించిందని.. మరో త్రైమాసికం సంస్థకు ఇలాగే ఉంటుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ప్రకటించింది.

ఈ _ బిట్టాడా అనే సంస్థ జొమాటో వృద్ధిని నాలుగు నుంచి పది శాతం వరకు ఉంటుందని ప్రకటించింది.. జొమాటో డెలివరీ రాబడిలో 25 శాతం వృద్ధి నమోదు అవుతుందని సీఏజీఆర్ సంస్థ తెలిపింది. జొమాటో వ్యయాన్ని తగ్గించుకోవడం.. వినియోదారుల్లో సుముఖత పెరగడంతో .. యూనిట్ ఎకనామిక్స్ స్కేల్ క్రమంగా మెరుగుపడుతోందని ఆ సంస్థ చెబుతోంది. “జొమాటో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.3% వృద్ధి నమోదు చేసింది. అయితే విభిన్నమైన వాతావరణ పరిస్థితుల వల్ల కంపెనీ సొంత అంచనాల కంటే తక్కువగానే వృద్ధి నమోదయిందని” ఎంకె గ్లోబల్ సంస్థ అభిప్రాయపడింది. జొమాటో రాబోయే కొన్ని త్రైమాసికాల్లో సంవత్సరానికి 50 శాతానికి మించి అభివృద్ధిని నమోదు చేస్తుందని పలు బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇక శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల 20 నిమిషాలకు బీఎస్ఈ లో జొమాటో షేర్ల ట్రేడింగ్ ప్రారంభమైంది. 3.75% లాభంతో ₹149.40 వద్ద ట్రేడ్ అయింది.. తర్వాత క్రమక్రమంగా పెరిగింది. దీంతో జొమాటో షేర్లను కొనుగోలు చేసిన మదుపరులు పండగ చేసుకుంటున్నారు.