Mahesh and Gunasekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మంచి గుర్తింపు ఉంటుంది. అయితే హీరో, డైరెక్టర్ ఇద్దరు కలిసి చేసిన మొదటి సినిమా సక్సెస్ అయిందంటే ఆ తర్వాత వాళ్ల కాంబో లో వచ్చే సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆ అంచనాలను అందుకోవడానికే హీరో డైరెక్టర్ ఇద్దరూ కలిసి బాగా కష్టపడి మరి ఒక మంచి ప్రాడక్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే మహేష్ బాబు హీరోగా గుణ శేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మధుర మీనాక్షమ్మ టెంపుల్ ని ఆధారంగా చేసుకుని అర్జున్ అనే సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ఆవరేజ్ గా నిలిచింది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో మహేష్ బాబు సైనికుడు అనే సినిమా చేశాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఇక ఈ సినిమా వల్ల గుణశేఖర్ పట్ల మహేష్ బాబు కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఈ సినిమాకి ముందే మహేష్ బాబు పోకిరి సినిమాతో ఇండస్ట్రీకి హిట్ కొట్టి ఉన్నాడు. కాబట్టి మళ్ళీ సైనికుడు ఫ్లాప్ అవడం తో తను కొంతవరకు నిరాశ చెందినట్టుగా అప్పట్లో మీడియాలో చాలా కథనాలైతే వెలువడ్డాయి. ఇక మహేష్ బాబు కొద్దిరోజుల పాటు గుణశేఖర్ తో మాట్లాడలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు గుణశేఖర్ ఏదైనా కథ చెప్తాను అని వచ్చిన కూడా మహేష్ బాబు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే వార్తలైతే వస్తున్నాయి.
సక్సెస్ ఉన్నవాళ్లతోనే ఇక్కడ హీరోలు ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే హీరోల క్రేజ్ అనేది భారీగా పడిపోతుంది. అదే ఒక్క సినిమా హిట్ అయితే వాళ్ల క్రేజ్ తార స్థాయి లో పెరిగిపోతుంది. కాబట్టి హీరోలకు సక్సెస్ మాత్రమే కావాలి. దానికోసమే దర్శకుడు విపరీతంగా కష్టపడి ఒక సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ చేయాలని చూస్తూ ఉంటాడు…