Anirudh: పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి వంటి ఫ్లాప్ సినిమా ని తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది..అజ్ఞాతవాసి సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం వల్లో ఏమో తెలీదు కానీ..త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేసాడు..డైలాగ్స్ దగ్గర నుండి యాక్షన్ సన్నివేశాలు వరుకు ‘త్రివిక్రమ్ ఇంత మాస్ గా సినిమా తియ్యగలడా’ అని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపొయ్యేలా చేసాడు ఈ సినిమాతో..అయితే తొలుత ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని అనుకున్నాడు త్రివిక్రమ్..ఈ సినిమా ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరు అయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ఓపెనింగ్ ఈవెంట్ లో కూడా అనిరుధ్ హాజరు అయ్యాడు..కానీ ఈ సినిమా ఓపెనింగ్ అయిన కొద్దీ రోజుల తర్వాత అజ్ఞాత వాసి సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడం..త్రివిక్రమ్ అనిరుధ్ ని పక్కన పెట్టి థమన్ ని తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ సంఘటన గురించి అనిరుధ్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..తెలుగు లో సినిమాలు చెయ్యడానికి నాకు ఎప్పుడు ఇష్టమే అని..కానీ ఒక్క సినిమా ఫ్లాప్ అయ్యింది అని నన్ను ఒక్క డైరెక్టర్ పక్కన పెట్టాడు అని పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించి మాట్లాడాడు అనిరుధ్..అప్పట్లో ఆ డైరెక్టర్ అలా చెయ్యడం నన్ను ఎంతగానో బాధించింది అని..తెలుగు ఇండస్ట్రీ లో నాకు ఎదురు అయిన చేదు అనుభవం అదే అని చెప్పుకొచ్చాడు అనిరుధ్..కానీ నా మ్యూజిక్ అంటే టాలీవుడ్ హీరోలందరికీ బాగా ఇష్టం అని..ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా సినిమాకి సంగీతం అందిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు..ఈరోజు టాలీవుడ్ నుండి తనకి వస్తున్నా క్రేజీ ఆఫర్స్ అప్పట్లో తనకి జరిగిన అవమానం ని ఒక్క పీడకల లాగ మర్చిపొయ్యేలా చేసింది అంటూ చెప్పుకొచ్చాడు అనిరుధ్..ఇటీవల కాలం లో అనిరుధ్ మ్యూజిక్ అందించిన సినిమాలు అన్ని కూడా సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..సినిమాలో పెద్దగా విషయం లేకపోయినా కూడా అనిరుధ్ అందించిన క్రేజీ మ్యూజిక్ వల్ల బ్లాక్ బస్టర్ గా మారిన సినిమాలు ఉన్నాయి..దానికి ఉదాహరణ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాని తీసుకోవచ్చు.

Also Read: AP SSC Results – JanaSena: జగన్ కు ఇది అవమానం.. జనసేనకు కొత్త వరం..
కథ కథనం పరంగా సినిమా గొప్పగా లేకపోయినప్పటికీ కూడా పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ లో ప్రేక్షకులను కదలకుండా కూర్చునేలా చేసాడు అనిరుధ్..కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా తిరుగులేని స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న అనిరుధ్ ఇప్పుడు టాలీవుడ్ ని కూడా ఏలేయడానికి సిద్ధం అవుతున్నాడు..ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ వీడియో లో అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము లేపేసింది..ఫాన్స్ నుండే కాకుండా ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..తెలుగు లో చాలా కాలం తర్వాత పెద్ద హీరో సినిమాకి మ్యూజిక్ కొట్టే అవకాశం రావడం తో..ఎన్టీఆర్ కి ఆయన ఫాన్స్ కి మెమొరబుల్ గా ఉండేటట్టు మ్యూజిక్ ని అందించబోతున్నాడు అట అనిరుధ్.కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఆగష్టు నెల నుండి షూటింగ్ ని ప్రారంబించుకోబోతుంది..సుమారు 150 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అన్ని ప్రాంతీయ బాషలలో పాన్ ఇండియా లెవెల్ లో తియ్యబోతున్నాడట కొరటాల శివ..ఎన్టీఆర్ నుండి #RRR తర్వాత వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ భారీ అంచనాలు ఉండడం సహజం..మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యే విధంగా కొరటాల శివ తీస్తాడో లేదో చూడాలి.
Also Read: Kalyan Dev: అల్లుడు కెరీర్ గాలికొదిలేసిన చిరంజీవి!

[…] Also Read: Anirudh: అది ఒక పీడకల అనుకొని మర్చిపోతాను […]