Summer Health Tips: ఇళ్లలో నుంచి బయటకు రాకండి.. పిల్లలు, వృద్ధులు జాగ్రత్త.. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి…గత రెండేళ్లుగా ప్రభుత్వాలు కరోనాను దృష్టిలో పెట్టుకొని ఈ సూచనలు చేసింది. కానీ ఇప్పుడు కూడా ఇవే సూచనలను చేస్తోంది. అయితే ఇప్పుడు కరోనా గురించి కాదు. ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్న వేళ అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా ఏప్రిల్ చివరి నుంచి మే నెల మొత్తం అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ ఈసారి మార్ఛి నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా మంది వడదెబ్బతో మరణిస్తున్నారు. ఉష్ణోగ్రతకు తాళలేక చాలా విద్యాసంస్థలు ముందే సెలవులు ప్రకటించేశాయి. అయితే ఈ పరిస్థితి ఎలా ఏర్పడింది..? ఇన్నేళ్లలో రాని ఉష్ణోగ్రతలు ఇంత అత్యధికంగా ఎందుకు నమోదువుతున్నాయనే దానిపై స్పెషల్ ఫోకస్..

జనవరి చివరిలో చలికాలం పూర్తవగానే వేసవి కాలం మొదలవుతుంది. ఫిబ్రవరి నుంచి మొదలయ్యే సమ్మర్ మే లో ఉధృతమవుతోంది. కానీ ఈసారి హోలీ పండుగ నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 1901 నుంచి 2022 మధ్య కాలంలో ఇంతలా ఉష్ణోగ్రతలు నమోదవడం ఇది మూడోసారి. ఈ ఏడాదిలో ఇప్పటికే వడగాలులు తీవ్రమయ్యాయి. వడగాలలులు మే నెలలో ఎక్కువగా వస్తాయి. కానీ నెల ముందే వడగాలులతో జనం అవస్థలు పడుతున్నారు. దీంతో తూర్పు, మధ్య, ఉత్తర భారత ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.
సాధారణంగా ఇండియాలో సగటు వర్షపాతం 30.4 మిల్లీ మీటర్లు. కానీ ఏడాది 8.9 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. దేశంలో పశ్చిమ ప్రాంతం నుంచే ఎక్కువగా వడగాలులు వీస్తున్నాయి. ఈ దశ మే చివరిలో ఉండాలి. కానీ ఏప్రిల్ 11 నుంచి ఈ పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రతీ నాలుగు సంవత్సరాలకొకసారి ఇటువంటి తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఇనిస్టిట్యూట్ కు చెందిన మరియం జకారియా, ఫ్రెడరిక్ ఒట్టో పరిశోధనలు చెబుతున్నాయి.
Also Read: సండే స్పెషల్: మాంసానికి బదులు ఇవి తింటే గుండెజబ్బులు రావు
భూతాపం పెరగడానికి మానవ చర్యలు కూడా కారణం అవుతున్నాయి. మన దేశంలో ఈనెల ప్రారంభంలో చూసిన ఉష్ణోగ్రతలు 50 ఏళ్ల కింద నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం ఇది సాధారణ విషయమే అయినా అది ప్రమాదకంగా కూడా మారవచ్చు. అధిక ఉష్ణోగ్రతలతో మానవ అవసరాలు కూడా విపరీతంగా పెరిగాయి. వేడిని తట్టుకోవడానికి చల్లదనం కోసం విద్యుత్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ కొరత తీవ్రమైంది. ఈ క్రమంలో థర్మల్ పవర్ ప్లాంట్లలో అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి పెరగడం వల్ల బొగ్గు కొరత ఏర్పడింది. అయితే రాబోయే రోజుల్లు దీనికి అంతరాయం ఏర్పడవచ్చని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగినందున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో బాధపడుతుంటే హీట్ స్ట్రోక్ కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తక్షణ వైద్య అవసరమని అంటున్నారు. శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు అధికంగా నీరు తీసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మరోవైపు అత్యవసం అయితే తప్ప ఎండలో తిరగకుండా జాగ్రత్తపడాలి. ఉదయం వ్యాయామం చేసేటప్పుడు కూడా జాగ్రత్తపడాలి. ఏసీలు, కూలర్లు వాడడంతో పాటు చల్లని నీటితో స్నానం చేస్తే బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: ఆదివారం మాంసం ఎందుకు తినకూడదు?