Homeఎంటర్టైన్మెంట్Prashanth Neel: హిట్ అయితేనే పార్ట్ 2 అంటున్న ప్రశాంత్ నీల్

Prashanth Neel: హిట్ అయితేనే పార్ట్ 2 అంటున్న ప్రశాంత్ నీల్

Prashanth Neel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ రెండు భాగాలుగా రానుందని వార్తలు వచ్చాయి. అసలు ఈ మధ్య తమ సినిమాకి బడ్జెట్ పెరిగితే.. దర్శక నిర్మాతలు వెంటనే రెండు పార్ట్స్ అంటూ హడావుడి చేస్తున్నారు. నిజానికి ఈ రెండు భాగాల ట్రెండ్ బాహుబలితో ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో సర్వసాధారణం అయిపోయింది.

Prashanth Neel
Prashanth Neel

ఒక సినిమాకు రెండు భాగాలు అంటే.. రెండు సినిమాలకు వచ్చే అంత డబ్బు వచ్చినట్టే. నిజానికి బాహుబ‌లి రెండు భాగాలుగా రావడం వల్లే, వందల కోట్లు లాభాలను గడించింది. ఇక కేజీఎఫ్ తొలి భాగం సూప‌ర్ హిట్ అయి కోట్లు కుమ్మ‌రించింది. రానున్న చాప్ట‌ర్ 2 పూర్తిగా లాభమే. అందుకే బన్నీ ఎక్కువ ఆలోచించకుండా పుష్షను పార్ట్ 1, పార్ట్ 2గా మార్చేసి.. బడ్జెట్ పై నిర్మాతలకు భరోసా ఇచ్చాడు.

Also Read: RRR Naatu Naatu Video Song: ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ వీడియో సాంగ్ రిలీజ్ !

అందుకే స‌లార్‌ కూడా అదే దారిలో వెళ్తుంది అని ప్రచారం జరిగింది. కాగా ఈ వార్తల పై తాజాగా ప్ర‌శాంత్ నీల్ స్పందించాడు. కేజీఎఫ్ 2 ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్ర‌శాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘కేజీఎఫ్ హిట్ట‌య్యాక నాకు పార్ట్ 2 చేయాలనే ఆలోచ‌న వ‌చ్చింది. స‌లార్ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే.. రెండు భాగాలుగా చేయాల‌ని ఇప్ప‌టికైతే ఏమీ అనుకోలేదు.

అనుకుంటే మాత్రం.. ఓ పెద్ద ఈవెంట్ నిర్వ‌హించి చెబుతాం“ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ రెండు భాగాలుగా తీస్తున్న‌ట్టా, లేదా ? అనే డౌటు మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఇదే ప్రశ్న మీడియా ప్రశాంత్ నీల్ ను అడిగితే.. స‌లార్ గురించి ఇప్పుడు ఏమి చెప్పలేను అంటూ మాట్లాడ‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌లేదు.

ప్రస్తుతం త‌న ధ్యాసంతా.. కేజీఎఫ్ 2పైనే ఉంది అంటూ స‌లార్ గురించి వార్తలను అవాయిడ్ చేశాడు. అయితే, ప్ర‌శాంత్ నీల్ మాటల్లో ఒక్క‌టి మాత్రం స్పష్టం అయ్యింది. ఒకవేళ, స‌లార్ హిట్ట‌యితే.. సలార్ పార్ట్ 2 ఉంటుంది. ‘స‌లార్’ హిట్ కాకపోతే పార్ట్ 2 ఉండదు. కేజీఎఫ్ ఫార్ములానే స‌లార్ విష‌యంలోనూ అప్లై చేయాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడు.

Prashanth Neel
Prashanth Neel, Prabhas

ఒకవేళ సలార్ రెండు భాగాలుగా వస్తే.. నిర్మాతలకు లాభాల పంట పండినట్టే. పైగా ప్రభాస్ హీరో, బాహుబలి హీరో అంటూ నేషనల్ వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అన్నిటికి మించి ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌ లో రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలని సలార్ నిర్మాతలు ఆశ పడుతున్నారు.

ఏది ఏమైనా బిజినెస్‌ ప‌రంగా కూడా భారీ లాభాల‌ను ఆర్జించ‌డంలో ప్ర‌శాంత్ నీల్, రాజమౌళి లాగే బాగా ఆరితేరిపోయిన. కాకపోతే స‌లార్‌ ప్రారంభించే ముందు స్క్రిప్ట్ ను ఒక పార్ట్ కి అనుకునే రాసుకున్నారు. మరి మధ్యలో స్క్రిప్ట్ మారిస్తే.. అసలుకే మోసం వస్తోందేమో చూడాలి.

Also Read:Ghani Movie 3 Days Collections: 25 కోట్లు పెట్టి తీశారు.. మూడు రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో తెలుసా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Oktelugu Epaper
Exit mobile version