Naga Chaitanya: మన సమాజం లో చట్టం ముందు అందరూ సమానులే..ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా సినీ నటుడు అయినా రాజ్యాంగ బద్దంగా నడుచుకోవడం తప్పనిసరి..కొన్ని కొన్ని సార్లు చట్టం ధనవంతులు మరియు రాజకీయ నాయకులూ పైన ఒక్కలాగా మరియు సామాన్యుల కి మరొకలాగా పని చెయ్యడం ఇది వరుకు మనం ఎన్నోసార్లు చూసాము,కానీ చట్టం దృష్టిలో ఎవరైనా ఒక్కటే అని మరోసారి అందరికి అర్థం అయ్యేలా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హైదరాబాద్ పోలీసులు..గడిచిన కొన్ని సంవత్సరాలలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి ప్రముఖులను కూడా వదలకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారి కార్లను పలుమార్లు తనిఖీ చేసిన సంఘటనలు మనం ఎన్నో చూసాము..ఈ వార్తలు అప్పట్లో మీడియా లో బ్రేకింగ్ న్యూస్ గా మోతమోగిపోయింది కూడా..ఇప్పుడు లేటెస్ట్ గా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్య..అతని కారుని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలు అతిక్రమించినందుకు గాను జరిమానా కూడా విధించారు, ఇంతకీ నాగ చైతన్య అతిక్రమించిన ఆ నిబంధన ఏమిటి?..ఎందుకు ఆయన జరిమానా కట్టాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూద్దాము.

హైదరాబాద్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం Y కేటగిరీ సెక్యూరిటీ ఉన్నవారి కార్లకు తప్ప వేరే ఎవ్వరి కార్లకు కూడా బ్లాక్ ఫిలిం అద్దాలకు తగిలించకూడదు అనే రూల్ ఎప్పటి నుండో ఉంది..ఈ రూల్ ని అతిక్రమించిన వారికి 700 రూపాయిలు జరిమానా విధిస్తారు, ఈ నిబంధన ని ఎవ్వరు అతిక్రమించిన కూడా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా రాజకీయ నాయకులు అయినా ఉపేక్షించేది లేదు..అలా నిన్న నాగ చైతన్య కారుకి కూడా బ్లాక్ ఫిలిం ఉండడం తో ఆయన కారుని ఆపి తనిఖీలు చేసి బ్లాక్ ఫిలిం ని తొలగించి జరిమానా విధించారు హైదరాబాద్ పోలీసులు..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..చిన్న పెద్ద అని తేడా లేకుండా తమ విధి నిర్వహణని సరిగ్గా చేసినందుకు గాను హైదరాబాద్ పోలీసులను సోషల్ మీడియా లో నెటిజెన్లు సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, అలాగే నాగ చైతన్య కూడా పోలీసు వారికి సహకరించినందుకు ఆయనని కూడా నెటిజెన్లు మెచ్చుకుంటున్నారు.
Also Read: హిట్ అయితేనే పార్ట్ 2 అంటున్న ప్రశాంత్ నీల్
ఇక నాగ చైతన్య ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవల ఆయన హీరో గా నటించిన లవ్ స్టోరీ మరియు బంగార్రాజు వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలుగా నమోదు చేసుకున్నాయి, ఈ రెండు సినిమాలు కూడా నాగ చైతన్య కి యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టింది..ఇక ఈ సినిమాల తర్వాత ఆయన మనం సినిమా దర్శకుడు విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమాని చేస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకి చేరుకుంది..రాశి ఖన్నా ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా నటిస్తుంది, అక్కినేని హీరోలు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం తో అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి..మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి..ఈ సినిమా తో పాటు ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ ఛధా అనే సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ఆగష్టు నెలలో విడుదల కాబోతుంది.
Also Read: విడుదల కి ముందే RRR రికార్డ్స్ ని బ్రేక్ చేసిన KGF 2