
నిన్న పంత్ సెంచరీ కొట్టి భారత్ కు పునాది వేయగా.. ఈరోజు వాషింగ్టన్ సుందర్ 96 పరుగలతో అజేయంగా నిలిచాడు. అతడికి సహకరించేవారు లేక సెంచరీ మిస్ అయ్యాడు.మరో ఎండ్ లో అందరూ ఔట్ కావడంతో సుందర్ తృటిలో తన తొలి సెంచరీని మిస్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 365 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. చివర్లో సుందర్, అక్షర్ పటేల్ పట్టుదలతో ఆడటంతో ఈ భారీ స్కోరు సాధ్యమైంది. అయితే అక్షర్ రనౌట్ అయ్యాక ఇషాంత్, సిరాజ్ వెంటవెంటనే ఔట్ కావడంతో వాషింగ్టన్ సుందర్ తృటిలో సెంచరీని కోల్పోయాడు.
294/7 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్ కు అక్షర్, సుందర్ లు ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడి పరుగులు చేశారు. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లను విసిగించారు. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి 160 పరుగుల ఆధిక్యాన్ని సాధించిపెట్టారు.
ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఏమేరకు ఆడుతుంది? టీమిండియా ఎంత లోపు ఇంగ్లండ్ ను ఆలౌట్ చేస్తుందనే దానిపై భారత విజయం ఆధారపడి ఉంది. భారత బ్యాటింగ్ లో ముఖ్యంగా టాప్ ఆర్డర్ అంతా విఫలమైనా కూడా పంత్, సుందర్ లు వీరోచితంగా ఆడి ఈ టెస్టుపై భారత్ కు ఆధిక్యాన్ని తెచ్చిపెట్టారు.
INNINGS BREAK#TeamIndia all out 365, secure a 160-run lead in the 4⃣th @Paytm #INDvENG Test! @RishabhPant17 1⃣0⃣1⃣@Sundarwashi5 9⃣6⃣*
Follow the match 👉 https://t.co/9KnAXjaKfb pic.twitter.com/CNcVedSZAo
— BCCI (@BCCI) March 6, 2021