Polimera 2 Review: పొలిమేర 2 మూవీ ఫుల్ రివ్యూ…

ముఖ్యంగా ఈ సినిమాలో నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సినిమాలో సత్యం రాజేష్ తన క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించడంలో వందకి 100% సక్సెస్ అయ్యాడు.

Written By: Gopi, Updated On : November 3, 2023 11:47 am

Polimera 2 Review

Follow us on

Polimera 2 Review: ప్రతివారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల అటెన్షన్ ని క్రియేట్ చేసి అతన్ని థియేటర్ దాకా తీసుకెళ్లే సినిమాలుగా మారుతాయి. అలాంటి సినిమాల్లో ఈ వారం రిలీజ్ అయిన పొలిమేర 2 ఒకటి…గత రెండు సంవత్సరాల కిందట మా ఊరి పొలిమేర అనే టైటిల్ తో ఓటిటి లో ఒక సినిమా వచ్చి ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసిందనే చెప్పాలి.ఇక హార్రర్ ఎలిమెంట్స్ తో సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ప్రేక్షకుడి మైండ్ సెట్ తో ఆడుకున్న సినిమా మా ఊరి పొలిమేర ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ సినిమాలోని కంటెంట్ కి ఎంగేజ్ అయి ఆ కథ తో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ట్రావెల్ అవుతూ ఉంటాడు. పొలిమేర పార్ట్ వన్ క్లైమాక్స్ లో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చి పొలిమేర 2 సినిమాకి లీడ్ ఇచ్చాడు డైరెక్టర్… అయితే ఇవాళ్ల రిలీజ్ అయిన పొలిమేర 2 సినిమా పొలిమేర పార్ట్ వన్ లాగే మంచి పేరు సంపాదించుకొని హిట్ ట్రాక్ ఎక్కిందా లేదా అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఈ సినిమాకు సంబంధించిన కథ ఏంటి దానికి సంబంధించిన కథనాన్ని దర్శకుడు ఎలా నడిపాడు ప్రేక్షకుడిని ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనే విషయాలను మనం బ్రీఫ్ అనాలసిస్ లో తెలుసుకుందాం…

ముందుగా ఈ సినిమా కథలోకి వెళ్తే మల్లేశం అనే ఒక వ్యక్తి చేతబడులు చేసి కొంతమందిని చంపి తన ఐడెంటిటీ మార్చుకొని వేరే దగ్గరికి వెళ్లి బతుకుతుంటాడు అలా బతుకుతున్న మల్లేశంకి గుడి కి సంబంధించిన వ్యవహారంలో ఒక వ్యక్తితో గొడవ జరుగుతుంది ఆ వ్యక్తికి ఆ టెంపుల్ కి సంబంధం ఉంటుంది.ఇక ఇదే క్రమం లో ఆ వ్యక్తి కి, మల్లేష్ కి, టెంపుల్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలతో కథ సాగుతూ ఉంటుంది. అయితే మల్లేశం చివరికి మంచిగా మారాడా అసలు మల్లేశం చెడ్డవాడా, మంచివాడా అనే విషయాలని తెలుసుకోవాలంటే మాత్రం మీరు కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే…

ఇక ఈ సినిమాని డైరెక్టర్ అద్భుతంగా మలిచాడు అనే చెప్పాలి. ఒక కథని చివరి వరకు ఎంగేజ్ చేస్తూ ప్రెజెంట్ చేయడంలో 100 కి 100% డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఇక ఈ సినిమా కి స్క్రీన్ ప్లే అద్భుతంగా డిజైన్ చేసుకొని క్యారెక్టర్ తాలూకు ఇంటెన్స్ ఎక్కడ మిస్ యూస్ చేయకుండా ప్రతి క్యారెక్టర్ ని అవసరం మేరకే వాడుకుంటూ ఒక డెప్త్ ని మనకు పరిచయం చేస్తూ ఎక్కడ కూడా కథ నుంచి బయటికి వెళ్లకుండా ఆధ్యాంతం స్టొరీని ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాడు సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే మనకి స్టోరీ తాలూకు ఇంటెన్షన్ చెప్పేసి ప్రేక్షకుడిని స్క్రిప్ట్ కి సరెండర్ చేసేసాడు డైరెక్టర్…

ఇలాంటి క్రమంలో డైరెక్టర్ ఎలాంటి ఎలిమెంట్స్ తో సక్సెస్ కొట్టాలి అనుకున్నాడో అలాంటి ఎలిమెంట్స్ ని సినిమాలో పెట్టీ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాకి హీరో అయిన మల్లేశం క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం చూస్తే ఫస్ట్ పార్ట్ లో ఉన్న మల్లేశం కి సెకండ్ పార్ట్ లో ఉన్న మల్లేశంకి మధ్య ఉన్న ఆ వేరియేషన్ ని చాలా అద్భుతంగా రాసుకున్నాడు… అయితే ఈ సినిమా మొదటి నుంచి హార్రర్ సినిమాగా పొట్రే చేసినప్పటికీ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మినహాయిస్తే మిగిలిన ఎక్కడ కూడా పెద్దగా హార్రర్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు సినిమా ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుంది. ఇక ఒకటి రెండు హార్రర్ ఎలిమెంట్స్ ని మినహాయిస్తే ఇందులో హారర్ పెద్దగా లేదనే చెప్పాలి…

ఇక ముఖ్యంగా ఈ సినిమాలో నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సినిమాలో సత్యం రాజేష్ తన క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించడంలో వందకి 100% సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు సత్యం రాజేష్ అంటే కామెడీ సినిమాల్లో కామెడీ పాత్రలు చేసేవాడు కానీ ఇప్పుడు సత్యం రాజేష్ అంటే మాత్రం టోటల్ గా ఇంప్రెషన్ మొత్తం మారిపోయింది. ఒక డిఫరెంట్ అటెంప్ట్ తో సినిమాలు చేయడంలో సత్యం రాజేష్ ఎప్పుడు ముందుంటాడు అనే పేరు అయితే సంపాదించుకున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో దొరికిన మరొక అద్భుతమైన అవకాశాన్ని చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడనే చెప్పాలి. ఇక కామాక్షి భాస్కర్ల కూడా అద్భుతంగా నటించింది. గెటప్ శీను, బాలాదిత్య వాళ్ళ పరిధి మేరకు ఎక్కడ అవుట్ ఆఫ్ ది క్యారెక్టర్ వెళ్లకుండా లిమిటేషన్స్ కి తగ్గట్టుగా చేస్తూ సినిమా కి ప్లస్ అయ్యారు…
ఇక ఈ సినిమాలో మ్యూజిక్ అందించిన జ్ఞాని తనదైన మ్యూజిక్ తో కొంతవరకు సినిమాకి హెల్ప్ చేశారనే చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ రమేష్ రెడ్డి కూడా ఈ సినిమాకి చాలా వరకు తన విజువల్స్ తో ఒక గ్రాండీయర్ ని తీసుకొచ్చాడు ఇక ఎడిటర్ అయితే కొన్ని షాట్స్ ని ట్రిమ్ చేయడంలో ఎక్కువ ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది…

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సత్యం రాజేష్ యాక్టింగ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందనే చెప్పాలి. అలాగే డైరెక్షన్ గాని, స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని ఈ సినిమాకి చాలా వరకు ప్లేస్ అయింది.ఇక కొన్ని హార్రర్ సీన్స్ కూడా అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి…

ఇక సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో లైటింగ్ అంత అద్భుతంగా చేయలేకపోయారు దానివల్ల కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ ఎలివేట్ అవ్వడంలో కొంతవరకు తగ్గిందనే చెప్పాలి…
అలాగే ఈ సినిమా లో ట్విస్ట్ లు కూడా ఎక్కువగా ఉండటంతో అది కూడా ఈ సినిమాకు కొద్దిగా మైనస్ గా మారిందనే చెప్పాలి…ఇక ఇది ముందు నుంచి హార్రర్ గా ప్రజెంట్ చేయడం వల్ల హార్రర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమా చూస్తే కొంతవరకు నిరాశ చెందవచ్చు…

ఇక పొలిమేర మొదటి పార్ట్ చూసిన ప్రేక్షకులు అందరూ కూడా సెకండ్ పార్ట్ చూసి ఎంజాయ్ చేయవచ్చు…

ఇక ఈ సినిమా కి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5