PM Modi : క్రైస్తవ సమాజాన్ని అక్కున చేర్చుకోవటంలో మోడీ ఆంతర్యమేంటి?

క్రైస్తవ సమాజాన్ని అక్కున చేర్చుకోవటంలో మోడీ ఆంతర్యమేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 27, 2023 5:31 pm

PM Modi : మోడీ డిసెంబర్ 25న ఓ ప్రత్యేక పని చేశారు. ఎప్పుడూ లేనిది మోడీ ప్రధానమంత్రి నివాసంలో క్రిస్మస్ వేడుకలు జరిపారు. ప్రముఖ బిషప్ లు అందరూ హాజరయ్యారు. ఇంతవరకూ ఎప్పుడూ చేయనిది.. క్రైస్తవ సమాజంతో ఇంటరాక్ట్ అవుతూ చొరవ తీసుకోవడం వెనుక మోడీ వ్యూహం ఏంటి ? అన్నది ఆసక్తి రేపుతోంది.

2002 అల్లర్ల తర్వాత అందరినీ కలుపుకొని వెళ్లాలనే మోడీ చూస్తున్నారు. బోక్రా ముస్లింలు, గుజరాత్ క్రైస్తవులతోనూ మోడీ సమావేశమయ్యారు. అలా అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. వ్యక్తిగతంగా మాత్రం అలాంటి మనస్తత్వం మోడీకి ఉండదు. అయితే మోడీ క్రైస్తవులతో భేటి వెనుక కారణం ఉంది.

అంతర్జాతీయంగా అమెరికా, యూరప్ లు క్రిస్టియన్ సమాజంతో నిండి ఉన్నాయి. మోడీ క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా అన్న భావన పాశ్చాత్య దేశాలకు ఉంది. దాన్ని తొలగించాలనే ఈ చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

క్రైస్తవ సమాజాన్ని అక్కున చేర్చుకోవటంలో మోడీ ఆంతర్యమేంటి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.