Homeఎంటర్టైన్మెంట్Venky Atluri: వెంకీ అట్లూరి కి స్టార్ హీరోలు అవకాశం ఇవ్వకపోవడానికి కారణమేంటి...

Venky Atluri: వెంకీ అట్లూరి కి స్టార్ హీరోలు అవకాశం ఇవ్వకపోవడానికి కారణమేంటి…

Venky Atluri: వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘తొలిప్రేమ’ సినిమాతో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి సినిమాలతో ఫ్లాప్ లను మూట గట్టుకున్నాడు. ఇక అతనికి తెలుగులో ఉన్న మీడియం రేంజ్ హీరోలెవ్వరు అవకాశాన్ని ఇవ్వకపోవడంతో ధనుష్ ను హీరోగా పెట్టి ‘సార్’ అనే సినిమా చేశాడు. ఈ మూవీతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు. ప్రస్తుతం సూర్య ను హీరోగా పెట్టి ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ అనే సినిమా చేస్తున్నాడు… నిజానికి వెంకీ అట్లూరి చాలా మంచి దర్శకుడు. ముందుగా అతను రైటర్ గా కొన్ని సినిమాలకు వర్క్ చేశారు.

కాబట్టి రైటింగ్ స్కిల్స్ కూడా అతనిలో చాలా ఎక్కువగా ఉంటాయి. అతను రాసుకున్న కథలో ఒక జెన్యూన్ అటెంప్ట్ ఇస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగులో ఉన్న స్టార్ హీరోలు ఎందుకని అతన్ని పట్టించుకోవడం లేదు. అతని నుంచి ఒక సినిమా వస్తే అది ప్రేక్షకుడిలో ఒక ఆలోచనను రేకెత్తించే విధంగా ఉంటుంది. సగటు మనిషి జీవితాన్ని సైతం తను పోట్రే చేసే విధంగా తన కథలను రాసుకుంటూ ఉంటాడు.

అలాంటి దర్శకుడిని ఎంకరేజ్ చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే అతని సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండవని స్టార్ హీరోలని బ్యాలెన్స్ చేసే కెపాసిటి అతని కథల్లో తక్కువగా ఉంటుందని అందువల్లే అతన్ని స్టార్ హీరోలు రిఫర్ చేయడం లేదంటూ కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి వెంకీ అటూరి తన సినిమాలో కమర్షియాలిటిని నింపేసుకొని స్టార్ హీరోలతో సినిమాలు చేయొచ్చు.

కానీ అతను రాసుకున్న కంటెంట్ ను జెన్యూన్ గా అటెంప్ట్ చేస్తేనే దానికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన చిన్న హీరోలను మీడియం రేంజ్ హీరోలను సెలెక్ట్ చేసుకొని మరి సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతానికైతే సూర్యతో సినిమా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక పెద్ద సినిమా అనే చెప్పాలి. ఈ మూవీ సక్సెస్ అయితే నెక్స్ట్ తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరు అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలైతే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version