Muft Bijli Yojana: ఉచిత విద్యుత్.. స్వయంగా ట్వీట్‌ చేసిన మోదీ.. ఎలా అంటే..

తాజాగా ప్రధాన మంత్రి సూర్యోదయ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

Written By: Raj Shekar, Updated On : February 13, 2024 6:45 pm
Follow us on

Muft Bijli Yojana: ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన ప్రారంభించారు. ఇప్పుడు ఈ పథకంపై దేశవ్యాప్తగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. సూరో‍్యదయ యోజన కింద కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల కరెంటు ఉత్పత్తి చేసే సౌర ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇళ్ల పైకప్పులపై సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కేంద్రం భారీగా సబ్సిడీ ఇస్తుంది. గతంలో ఈ సబ్సిడీ 40 శాతం ఉండగా దానిని 60 శాతానికి పెంచారు. ప్రజలు 40 శాతం మాత్రమే రుణంగా తీసుకోవచ్చు.

బడ్జెట్‌లో ప్రతిపాదన..
తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్యానెల్‌ స్కీం ప్రకటించింది. దీని ద్వారా కోటి మందికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని వెల్లడించారు. ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కింద ఈ బెనిఫిట్‌ పొందవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ స్కీం ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండ ప్రజలు తమ పైకప్పులపై విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు పీఎంఎస్‌వై పథకం ద్వారా గరిష్ట ప్రయోజనాలను పొందేలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నెలవారీ విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లకన్నా తక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ స్కీంలో ప్రధాన్యం ఇస్తామని తెలిపారు.

మోదీ ట్వీట్‌..
తాజాగా ప్రధాన మంత్రి సూర్యోదయ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. దేశంలో స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కోటి ఇళ్లలో సౌర వెలుగులు నింపేలా ఈ పథకాన్ని తీసుకువచ్చామని, ఇందుకు రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా 300 యూనిట్ల ఉచిత కరెంట్ పొందవచ్చని పేర్కొన్నారు. సౌర విద్యుత్ వినియోగం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.

కరెంటు కొనుగోలు..
ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్యానెల్స్‌ పెట్టుకున్న లబ్ధిదారుడు అవసరాని మించి అధికంగా కరెంటు ఉత్పత్తి చేస్తే దానిని ఎస్‌పీవీ కొనుగోలు చేస్తుందని ప్రధాని తలిపారు. ఆ డబ్బులతో ప్యానెళ్లు ఏర్పాటుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ విధంగా 10 ఏల్లలో రుణం పూర్తిగా చెల్లిస్తారని తెలిపారు. రుణం చెల్లించిన తర్వాత సోలార్‌ ప్యానెల్‌ను పూర్తిగా లబ్ధిదారుడి పేరుమీదికి బదిలీ చేస్తారు.