రైతులకు మరో శుభవార్త చెప్పిన మోదీ సర్కార్.. ఏంటంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరైతే లోన్ తీసుకోవాలని అనుకుంటారో వారికి సులభంగా లోన్ పొందే అవకాశం కల్పించింది. పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీంతో కిసాన్ క్రెడిట్ కార్డు స్కీంను జత చేసింది. ఈ రెండు స్కీంలను జత చేయడం వల్ల కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం కింద లక్షల సంఖ్యలో దరఖాస్తులకు ఆమోదం […]

Written By: Kusuma Aggunna, Updated On : February 8, 2021 12:02 pm
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు ఎవరైతే లోన్ తీసుకోవాలని అనుకుంటారో వారికి సులభంగా లోన్ పొందే అవకాశం కల్పించింది. పీఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీంతో కిసాన్ క్రెడిట్ కార్డు స్కీంను జత చేసింది. ఈ రెండు స్కీంలను జత చేయడం వల్ల కిసాన్ క్రెడిట్ కార్డు స్కీం కింద లక్షల సంఖ్యలో దరఖాస్తులకు ఆమోదం లభించిందని తెలుస్తోంది.

Also Read: వరి పొట్టుతో లక్షలు సంపాదిస్తున్న ఒడిశా వాసి.. ఎలా అంటే..?

కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీంలో భాగంగా 7 లక్షల రూపాయల వరకు రుణాలను ఇస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ద్వారా తీసుకున్న రుణంలో లిమిట్ లోపు రుణాన్ని చెల్లించిన రైతులకు 4 శాతం వడ్డీకే లోన్ లభిస్తుంది. కేంద్రం లాక్ డౌన్ అమలైన సమయంలో రెండున్నర కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేయనున్నట్టు ప్రకటన చేయగా ఈ ఏడాది బడ్జెట్ లో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి కేంద్రం 16.5 లక్షల కోట్ల వరకు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని భావిస్తోంది.

Also Read: పెన్షనర్లే వాళ్ల టార్గెట్.. డిపాజిట్ కాగానే లక్షల్లో లూటీ..?

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కు అర్హులైన వారంతా కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం దేశంలోని 11 కోట్ల మంది రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ 11 కోట్ల మంది రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

కిసాన్ క్రెడిట్ కార్డు పథకంతో పీఎం కిసాన్ యోజన పథకాన్ని అనుసంధానం చేయడం వల్ల రైతులకు వేగంగా రుణాలు అందుతాయని కేంద్రం చెబుతోంది. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి పీఎం కిసాన్ యోజన స్కీమ్ తో కెసీసీని అనుసంధానం చేయడం లో సులువుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలను పొందవచ్చని తెలిపారు.