https://oktelugu.com/

పాత హీరోయిన్లను పైకి తెస్తున్న త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ‘అరవింద సమేత’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ ద్వయం నుండి వస్తున్న కొత్త ప్రాజెక్ట్ మీద భారీగానే అంచనాలున్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో తారక్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తాడనే ప్రచారం కూడా జరుగుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. Also Read: రాజమౌళితో మహేష్ బాబు సినిమా మరింత ఆలస్యం? […]

Written By:
  • admin
  • , Updated On : February 7, 2021 / 05:48 PM IST
    Follow us on


    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ‘అరవింద సమేత’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ ద్వయం నుండి వస్తున్న కొత్త ప్రాజెక్ట్ మీద భారీగానే అంచనాలున్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో తారక్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తాడనే ప్రచారం కూడా జరుగుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది.

    Also Read: రాజమౌళితో మహేష్ బాబు సినిమా మరింత ఆలస్యం?

    మాటల మాంత్రికుడు గత కొంతకాలంగా తన సినిమాల ద్వారా ఒకప్పటి కథానాయికలని తిరిగి ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ అభిమానులకి మంచి అనుభూతిని అందిస్తున్నాడు. అత్తారింటికి దారేది చిత్రంలో నదియా, ముంతాజ్, సన్నాఫ్ సత్యమూర్తిలో స్నేహ, అజ్ఞాతవాసిలో కుష్బూ, అరవింద సమేత వీర రాఘవలో దేవయాని, అల వైకుంఠపురములో టబు ఇలా చాలా మంది మాజీ హీరోయిన్ లకు అవకాశమివ్వటం జరిగింది. ఈ సుందరీమణుల వలన ఆయా సినిమాలకి కూడా కొంతమేర ప్లస్ అయ్యిందనుకోవచ్చు.

    Also Read: సలార్ మూవీలో విలన్ ఫిక్స్… ఎవరంటే?

    ఇదే క్రమంలో ఎన్టీఆర్ మూవీలో ప్రభాస్-రాఘవేంద్ర మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ‘అన్షు’ని ఒక కీలక పాత్రలో నటింపచేసేందుకు సంప్రదింపగా ఆమె అంగీకరించారని తెలుస్తుంది. అన్షు తెలుగులో హీరోయిన్ గా నాగార్జున సరసన మన్మధుడు మూవీ చేసి ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలలో చిన్న పాత్రలలో మెరిసి పూర్తిగా సినిమా రంగం నుండి బ్రేక్ తీసుకుంది. మరల ఇంతకాలానికి త్రివిక్రమ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులని కలవబోతుంది. ఈ సినిమాకు ‘‘అయిననూ పోయిరావలె హస్తినకు’’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు విడివిడిగా చేస్తున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్