https://oktelugu.com/

రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. ఇలా చేస్తే ఖాతాల్లోకి రూ.4 వేలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. కొత్తగా పీఎం కిసాన్ స్కీమ్ లో చేరేవాళ్లకు తీపికబురు అందించింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఇప్పటివరకు ఏడు విడతల నగదు రైతుల ఖాతాల్లో జమైంది. మరికొన్ని రోజుల్లో రైతుల ఖాతాల్లో ఎనిమిదో విడత నగదు జమ కానుందని తెలుస్తోంది. అయితే అర్హత ఉండి కొత్తగా పీఎం కిసాన్ స్కీమ్ లో చేరే రైతుల […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 8, 2021 / 11:42 AM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. కొత్తగా పీఎం కిసాన్ స్కీమ్ లో చేరేవాళ్లకు తీపికబురు అందించింది. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఇప్పటివరకు ఏడు విడతల నగదు రైతుల ఖాతాల్లో జమైంది. మరికొన్ని రోజుల్లో రైతుల ఖాతాల్లో ఎనిమిదో విడత నగదు జమ కానుందని తెలుస్తోంది.

    అయితే అర్హత ఉండి కొత్తగా పీఎం కిసాన్ స్కీమ్ లో చేరే రైతుల ఖాతాల్లో 7, 8 విడతలకు సంబంధించిన 4,000 రూపాయల నగదును జమ చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. మార్చి 31వ తేదీలోపు రిజిష్టర్ చేసుకున్న రైతులు పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. స్థానికంగా ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించి పీఎం కిసాన్ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    ఆన్ లైన్ పై అవగాహన ఉన్నవాళ్లు పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్ సైట్ లో ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పొలం పాస్‌బుక్ ల సాఫ్ట్ కాపీలను అప్ లోడ్ చేసి ఈ డాక్యుమెంట్ల సహాయంతో సులభంగా పీఎం కిసాన్ స్కీమ్ లో చేరవచ్చు.

    కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ను అమలు చేస్తుండగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతుల కోసం ప్రత్యేక స్కీమ్స్ ను అమలు చేస్తున్నాయి. ఈ స్కీమ్స్ ద్వారా రైతులకు తెలుగు రాష్ట్రాల సీఎంలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు.