Varalakshmi Tiffins: ఒక మహిళ.. ఇద్దరు టిఫిన్ సెంటర్ యజమానులు.. కలిసి ఆ పని.. కట్ చేస్తే పెద్ద డ్రగ్స్ దందా!

మొత్తం రుచికరమైన టిఫిన్స్ అమ్మే ప్రభాకర్ రెడ్డి.. రాత్రిపూట డ్రగ్స్ సరఫరా చేసే దందాలోకి చేరిపోయాడు. ఈ దందాలో అతడికి అనురాధ అనే మహిళ పరిచయమైంది.

Written By: Bhaskar, Updated On : September 13, 2023 12:55 pm

Varalakshmi Tiffins

Follow us on

Varalakshmi Tiffins: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపయోగాలు.. కాకపోతే ఈ ఉపాయాలు మంచి మార్గంలో సాగితే దరిద్రం అనేది పటాపంచలవుతుంది. ఎలాగూ దరిద్రంలో ఉన్నాం కదా అని.. డబ్బే కదా మనకు కావలసింది అని.. అడ్డమైన పనులు చేస్తే సీన్ రివర్స్ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు చేసే దొంగ పని బయట ప్రపంచానికి తెలుస్తుంది. చివరికి శ్రీకృష్ణుడి జన్మస్థానం శాశ్వత నివాసం అవుతుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెబుతున్నామంటే.. వీరు చేసిన పని అలాంటిది. వీరు ఎంచుకున్న వృత్తి చాటున చేస్తున్న ప్రవృత్తి అటువంటిది

అతడి పేరు ప్రభాకర్ రెడ్డి. చదువు పదవ తరగతి లోపే. స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో రోడ్డు పక్కన నాలుగు చక్రాల బండిమీద టిఫిన్ సెంటర్ పెట్టాడు. దానిద్వారా ఆదాయం అంతంత మాత్రమే వస్తుండడంతో ఎక్కువ సంపాదన కోసం ప్రకాశం నుంచి హైదరాబాద్కు 2017 లో వచ్చాడు. హైదరాబాదులోని గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ప్రాంగణం ప్రాంతాల్లో చిన్న టిఫిన్ సెంటర్ ప్రారంభించాడు. రుచి, నాణ్యత బాగుండడంతో ఐటీ ఉద్యోగులు అతడి టిఫిన్ సెంటర్ క్యూ కట్టారు. రాబడి బాగా వస్తున్న నేపథ్యంలో వరలక్ష్మి టిఫిన్స్ పేరుతో బ్రాంచ్లు ఏర్పాటు చేశాడు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల యాప్స్ లలో ఏ టిఫిన్ సెంటర్ ఎంత ఫేమస్ అని సెర్చ్ చేస్తే.. 4.4 పైగానే రేటింగ్ ఉండేలాగా వరలక్ష్మి టిఫిన్స్ పేరు సంపాదించాయి. దీంతో ఒక్కో టిఫిన్ సెంటర్ నుంచి మూడు నుంచి ఐదు లక్షల వరకు ప్రభాకర్ రెడ్డికి ఆదాయం వచ్చేది. అంటే రోజుకు 30 నుంచి 50 లక్షల వరకు ఆదాయం అన్నమాట. ఇలా డబ్బులు బాగా ప్రభాకర్ రెడ్డికి కొత్త కొత్త అలవాట్లు మొదలయ్యాయి. స్నేహితులతో కలిసి పబ్బులకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం ప్రారంభించాడు. క్రమంగా డ్రగ్స్ కు, ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డాడు.

మొత్తం రుచికరమైన టిఫిన్స్ అమ్మే ప్రభాకర్ రెడ్డి.. రాత్రిపూట డ్రగ్స్ సరఫరా చేసే దందాలోకి చేరిపోయాడు. ఈ దందాలో అతడికి అనురాధ అనే మహిళ పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి రోజు సాయంత్రం డ్రగ్స్ తీసుకునేవారు. శారీరకంగా కలుసుకునేవారు. అయితే అతడు అనురాధను డ్రగ్స్ స్మగ్లర్ గా మార్చాడు. ఆమెతో హైదరాబాద్ నగరంలో పలువురికి డ్రగ్స్ విక్రయించేది వాడు. ఇలా వారి జాబితాలో 15 మంది వివిఐపి కస్టమర్లు ఉన్నారు. ఈ దందాలో వారికి పల్లెటూరి పుల్లట్లు టిఫిన్ సెంటర్ యజమాని శివ సాయికుమార్ సహకరించేవాడు. వీరి గురించి సమాచారం అందడంతో హైబరాబాద్ మోకిలా పోలీసులు, రాజేంద్రనగర్ ఎస్ఓటి టీం సంయుక్తంగా దాడి చేసి అరెస్టు చేసింది. వారి వద్ద నుంచి ఎండిఎంఏ పిల్స్, 50 గ్రాముల ఎండిఎంఏ క్రిస్టల్, 51.45 గ్రాముల కొకైన్, ఐదు సెల్ ఫోన్లు, 97,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లర్ హైదరాబాద్ వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో దందాకు అలవాటు పడ్డ ప్రభాకర్ రెడ్డి కొత్త ప్లాన్ వేశాడు. అనురాధను విమానంలో గోవాకి పంపించి.. అక్కడ జేమ్స్ అనే డ్రగ్స్ డీలర్ ద్వారా.. వివిధ రకాల మాదకద్రవ్యాలు తీసుకుని బస్సు మార్గం ద్వారా నగరానికి రావాలని అనురాధకు సూచించాడు. కొంతకాలంగా గోవాకు వెళ్లి వస్తున్న అనురాధ.. తిరిగి గోవా నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు రెండు మూడు నగరాల్లో బస్సులు దిగేది. వేరే బస్సులు ఎక్కి చాకచక్యంగా నగరానికి వచ్చేది. తెచ్చిన డ్రగ్స్ ను ప్రభాకర్ రెడ్డికి అందజేసేది. ప్రభాకర్ రెడ్డికి 15 మంది వీవీఐపీ కష్టమర్లు ఉన్నారు. వీరిలో కొంతమంది నిర్మాణరంగంలో పెద్ద వ్యక్తులుగా చలామణి అవుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వీరిని పోలీసులకు విచారిస్తున్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి తో పాటు పోలీసులు అరెస్ట్ చేసిన అనురాధ స్వస్థలం కరీంనగర్. ఆమె తండ్రి సింగరేణిలో పనిచేస్తున్నారు. కొంతకాలం ఆమె మంచిర్యాలలో ఉంది. పెళ్లయి భర్త ఉన్నప్పటికీ అతనితో అంత సఖ్యతగా ఉండటం లేదు. దీంతో అతడు ఆమెను వదిలేసాడు. ఈ క్రమంలో మరో వ్యక్తితో ఆమె శారీరక సంబంధం పెట్టుకుంది. భర్త ద్వారా కలిగిన కుమారుడిని తల్లి వద్దే ఉంచుతోంది. వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తి ద్వారా డ్రగ్స్, ఇతర వ్యసనాలకు బానిస అయింది. ప్రస్తుతం నానక్ రామ్ గూడ ఒక విలాసవంతమైన ప్లాట్ లో ఉంటోంది. తన స్నేహితుడితో కలిసి తరచూ పబ్బులకు వెళ్ళేది. అక్కడ అతడి స్నేహితులైన ప్రభాకర్ రెడ్డి, శివ సాయికుమార్ అనురాధకు పరిచయమయ్యారు. ఇలా ప్రభాకర్ రెడ్డి ఆమె వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని డ్రగ్స్ స్మగ్లర్ గా మార్చాడు. చివరికి ఈ ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. వీరు చెప్పిన ఆధారాల ప్రకారం జేమ్స్ అనే నైజీరియా వ్యక్తి కోసం తెలంగాణ పోలీసులు గోవాకు బయలుదేరి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.